చైనాలో మళ్లీ మొదలైన గబ్బిలాల అమ్మకాలు

ABN , First Publish Date - 2020-04-01T02:46:20+05:30 IST

చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వైరస్‌కు కేంద్రమైన హుబే ప్రావిన్స్‌లో అన్ని సేవలను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. దీంతో ప్రజలు మళ్లీ రోడ్లపైకి వచ్చారు.

చైనాలో మళ్లీ మొదలైన గబ్బిలాల అమ్మకాలు

బీజింగ్: చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వైరస్‌కు కేంద్రమైన హుబే ప్రావిన్స్‌లో అన్ని సేవలను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. దీంతో ప్రజలు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. రవాణా, విమాన, తదితర సేవలను ప్రభుత్వం తిరిగి తెరిచింది. వీటితో పాటు వైరస్‌కు ఏ మార్కెట్లు అయితే కారణమో వాటిని కూడా చైనా మళ్లీ ప్రారంభించడం ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో మొట్టమొదటగా కరోనా వైరస్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. వూహాన్‌లోని హునన్ సీఫుడ్ మార్కెట్‌కు వెళ్లిన 55 ఏళ్ల వ్యక్తికి మొదటగా వైరస్ సోకినట్టు రిపోర్ట్ చెబుతోంది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వేరే జంతువుకు.. వాటి నుంచి మనుషులకు సోకినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇప్పుడు గబ్బిలాలు, తదితర జంతువుల అమ్మకాలను చైనా మళ్లీ మొదలుపెట్టడాన్ని ప్రపంచదేశాలు తప్పుపడుతున్నాయి. 


నాలుగు నెలల నుంచి కరోనా విళయతాండవం ఆడుతున్నా.. ఇప్పటివరకు చైనా వ్యాక్యిన్‌ను కనుగొనలేదు. కానీ, పరిస్థితి అదుపులోకి వచ్చింది కదా అని గబ్బిలాల అమ్మకాలను మాత్రం తిరిగి ప్రారంభించేసింది. చైనా ప్రభుత్వం జంతువులను విక్రయించే మార్కెట్లను పూర్తిగా నిషేధించాలంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పిలుపునిస్తున్నారు. ప్రపంచాన్ని కరోనా ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కరోనా వైరస్‌ను చైనీస్ వైరస్, వూహాన్ వైరస్‌గా పిలవడం కూడా చూస్తూనే ఉన్నాం. చైనా మాత్రం తన తప్పును తెలుసుకున్నట్టు ఏ మాత్రం కనిపించడం లేదు. కాగా.. ఈ మార్కెట్లను చైనా ప్రభుత్వం పూర్తి నిఘాతో నడుపుతున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-04-01T02:46:20+05:30 IST