డబ్ల్యూహెచ్‌ఓకు సమాచారమివ్వడంలో జాప్యం చేశామన్నది అవాస్తవం: చైనా

ABN , First Publish Date - 2020-06-03T22:36:23+05:30 IST

కరోనా మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించడంలో

డబ్ల్యూహెచ్‌ఓకు సమాచారమివ్వడంలో జాప్యం చేశామన్నది అవాస్తవం: చైనా

బీజింగ్: కరోనా మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించడంలో జాప్యం చేశామంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చైనా తెలిపింది. విదేశాంగశాఖ అధికారి జావో లిజియాన్ బుధవారం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇదే సమయంలో డబ్ల్యూహెచ్‌ఓతో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడంలో జాప్యం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి సమాచారాన్ని పంచుకోవడంలో చైనా జాప్యం చేయడం వల్ల డబ్ల్యూహెచ్ఓ నిరాశకు గురైందంటూ అసోసియేటెడ్ ప్రెస్ మంగళవారం తెలిపింది. అనేక డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు, రికార్డింగ్‌ల ద్వారా తమకు అనేక విషయాలు తెలిసినట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఈ సమాచారం ప్రకారం.. డబ్ల్యూహెచ్ఓ నిరాశకు గురైనప్పటికి.. చైనాను మాత్రం ప్రశంసిస్తూనే వచ్చింది. వైరస్ వ్యాప్తి గురించి చైనా ముందుగానే సమాచారం ఇచ్చిందంటూ డబ్ల్యూహెచ్ఓ బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం కూడా చూశాం. ఇదిలా ఉండగా.. డబ్ల్యూహెచ్ఓ చైనాకు అనుకూలంగా పనిచేస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా బయటకు వచ్చినట్టు కూడా గత శుక్రవారం ఆయన తెలిపారు. చైనాపై ఆధారపడటాన్ని ముగిస్తే.. తిరిగి డబ్ల్యూహెచ్ఓలో చేరేందుకు ఆలోచిస్తామని అయన అన్నారు.

Updated Date - 2020-06-03T22:36:23+05:30 IST