China: జోరు పెంచుతున్న ‘డ్రాగన్’.. నకు లా సమీపంలో శాశ్వత క్యాంపుల నిర్మాణం

ABN , First Publish Date - 2021-07-15T23:13:06+05:30 IST

భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారవుతున్న చైనా తాజాగా వాస్తవాధీన రేఖపై దృష్టిసారించింది. అక్కడ

China: జోరు పెంచుతున్న ‘డ్రాగన్’.. నకు లా సమీపంలో శాశ్వత క్యాంపుల నిర్మాణం

లడఖ్: భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారవుతున్న చైనా తాజాగా వాస్తవాధీన రేఖపై దృష్టిసారించింది. అక్కడ తన ఆర్మీని ఎల్లవేళలా మోహరించేందుకు కాంక్రీటు క్యాంపుల నిర్మాణం చేపడుతోంది. కొద్ది సమయంలోనే సరిహద్దులో అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 


సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొత్తగా కాంక్రీటు నిర్మాణాలు చేపడుతోందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి ఓ క్యాంపు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో కనిపించిందని తెలిపాయి. ఇలాంటి నిర్మాణాలే తూర్పు లడఖ్‌,  అరుణాచల్ ప్రదేశ్‌లో భారత భూభాగాలకు ఎదురుగా ఉన్న సమీప ప్రాంతాల్లో చైనా నిర్మించినట్టు ఆ వర్గాలు వివరించాయి. 


అవసరమైతే క్షణాల్లో వాస్తవాధీన రేఖ వద్దకు చేరుకునేలా రోడ్డు మార్గాలను అప్‌గ్రేడ్ చేస్తున్న చైనా.. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. తాజా నిర్మాణాల వల్ల ఎలాంటి పరిస్థితి ఎదురైనా తీవ్రంగా స్పందించేందుకు చైనా మిలటరీకి అవకాశం చిక్కుతుంది.


సరిహద్దులో చలికి తట్టుకోలేకపోతున్న చైనా సైనికులకు కాంక్రీటు నిర్మాణాల వల్ల రక్షణ లభిస్తుంది. పలితంగా భారత భూభాగానికి సమీపంలో బలగాల మోహరింపునకు అవకాశం కలుగుతుంది. వాస్తవాధీన రేఖ సమీపంలో చేపడుతున్న ఈ నిర్మాణాల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది.   

Updated Date - 2021-07-15T23:13:06+05:30 IST