china- taiwan military comparison: ఎవరి దమ్ము ఎంత? చైనా-తైవాన్ సైనిక బలాబలాలు

ABN , First Publish Date - 2022-08-04T23:52:23+05:30 IST

తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan) పర్యటనపై మండిపడుతోన్న చైనా (China) కయ్యానికి కాలుదువ్వుతోంది.

china- taiwan military comparison: ఎవరి దమ్ము ఎంత? చైనా-తైవాన్ సైనిక బలాబలాలు

తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan) పర్యటనపై మండిపడుతోన్న చైనా (China) కయ్యానికి కాలుదువ్వుతోంది. తైవాన్‌కు చుట్టూ అనేక ప్రాంతాల్లో యుద్ధ విన్యాసాలు చేస్తోంది. యుద్ధ విన్యాసాల వీడియోలను తమ అధికారిక మీడియాలో ప్రసారం చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. యుద్ధానికి సన్నద్ధమౌతూ తైవాన్, అమెరికాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. పెలోసి టూర్ ముగించుకుని వెళ్లిపోయినా తాము మాత్రం తేలిగ్గా తీసుకోబోమని చైనా హెచ్చరిస్తోంది. తమతో పెట్టుకుంటే ఏమౌతుందో చూపించాలని తహతహలాడుతోంది.





మరోవైపు తైవాన్ కూడా వెనక్కు తగ్గడం లేదు. డ్రాగన్ హద్దుమీరితే తగిన రీతిలో జవాబు చెప్పేందుకు సన్నద్ధమౌతోంది. అమెరికా అండగా ఉంటుందన్న భరోసాతో భయం లేకుండా ముందుకు అడుగులేస్తోంది. చైనా-తైవాన్ యుద్ధం ఖాయమనే వార్తలొస్తున్న నేపథ్యంలో రెండు దేశాల సైనిక బలాబలాలు ఒకసారి పరిశీలిద్దాం. చైనాతో పోలిస్తే సైనికపరంగా ఏ దశలోనూ పోటీ పడలేకున్నా తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌ (taiwan president tsai ing-wen) మాత్రం వెన్నుచూపడం లేదు. డ్రాగన్ వెన్నులో వణుకు పుట్టించేందుకు యత్నిస్తున్నారు. 



తైవాన్ ద్వీప దేశం కాగా చైనా నాలుగు వైపులా ఇతర దేశాలున్నాయి. ఇది తైవాన్‌కు వ్యూహాత్మకంగా అడ్వాంటేజ్ కానుండగా చైనాకు ఇబ్బందికరంగా పరిణమించనుంది. చైనా సరిహద్దు నుంచి తైవాన్ సరిహద్దుకు 130 కిలోమీటర్లు మాత్రమే ఉంది.  


చైనా వద్ద 20 లక్షల మంది యాక్టివ్ సైనికులుంటే తైవాన్ వద్ద్ కేవలం 1.7 లక్షల మంది ఉన్నారు. 


చైనా వద్ద 5.10 లక్షల మంది రిజర్వ్ సైనికులుంటే తైవాన్ వద్ద్ కేవలం 1.5 లక్షల మంది ఉన్నారు. 


చైనా వద్ద 3285 ఎయిర్‌క్రాఫ్ట్‌లుంటే, తైవాన్ వద్ద 741 ఉన్నాయి. 


చైనా వద్ద 1200 ఫైటర్ విమానాలుంటే తైవాన్ వద్ద్ 288 ఉన్నాయి. 


చైనా వద్ద రాడార్లకు కూడా దొరకవని చెప్పే అడ్వాన్స్‌డ్ యుద్ధ విమానాలున్నాయి. జే 11 ఫైటర్ జెట్ విమానాలు, జే 16 మల్టీరోల్ ఫైటర్ విమానాలు, సు 30 ఫైటర్ జెట్ విమానాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.


చైనా వద్ద రెండు అతి పెద్ద వార్‌షిప్‌లున్నాయి. 50 యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు సులభంగా ఈ నౌకల సాయంతో దాడులు చేయగలవు. తైవాన్ వద్ద ఒక్క వార్‌షిప్ కూడా లేదు. 


చైనా వద్ద 912 సైనిక హెలికాఫ్టర్లు, 281 అటాక్ హెలికాఫ్టర్లు ఉంటే తైవాన్ వద్ద 208 సైనిక హెలికాఫ్టర్లు, 91 అటాక్ హెలికాఫ్టర్లున్నాయి. 


చైనా వద్ద 5250 యుద్ధ ట్యాంకులుండగా, తైవాన్ వద్ద 1110 ఉన్నాయి. 


చైనా వద్ద 35 వేల సైనిక వాహనాలుండగా, తైవాన్ వద్ద 3472 ఉన్నాయి. 


చైనా వద్ద 4120 శతఘ్నలుండగా, తైవాన్ వద్ద 257 ఉన్నాయి. 


చైనా వద్ద 3160 మొబైల్ రాకెట్ ప్రొజెక్టులుండగా, తైవాన్ వద్ద 115 ఉన్నాయి. 


చైనా వద్ద 777 నేవీ ఫ్లీట్స్ ఉండగా తైవాన్ వద్ద 117 ఉన్నాయి. 


చైనా వద్ద 79 సబ్‌మెరైన్‌లుండగా, తైవాన్ వద్ద 4 మాత్రమే ఉన్నాయి. 


ఎవరి బలాబలాలు ఎలా ఉన్నా యుద్ధంలో ధైర్యంగా ఉండటమే అతి ముఖ్యమైనది. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని తైవాన్, అమెరికాతో దోస్తీకి తహతహలాడుతున్న తైవాన్‌కు మళ్లీ సాహసించే యత్నం చేయకుండా షాకిచ్చేందుకు డ్రాగన్ పోటీపడ్తున్నాయి. 

Updated Date - 2022-08-04T23:52:23+05:30 IST