Chinaతో బలమైన స్నేహమే నా ప్రభుత్వ దృఢ నిశ్చయం : కిమ్ జోంగ్ ఉన్

ABN , First Publish Date - 2021-07-11T17:52:30+05:30 IST

స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే దృఢ నిశ్చయాన్ని

Chinaతో బలమైన స్నేహమే నా ప్రభుత్వ దృఢ నిశ్చయం : కిమ్ జోంగ్ ఉన్

బీజింగ్ : స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే దృఢ నిశ్చయాన్ని చైనా, ఉత్తర కొరియా ప్రదర్శించాయి. ఇరు దేశాల రక్షణ ఒప్పందానికి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆదివారం చైనా, ఉత్తర కొరియా అధినేతలు సందేశాలను ఇచ్చి, పుచ్చుకున్నారని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది.


చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇచ్చిన సందేశంలో, ఇరు దేశాల మధ్య స్నేహ, సహకార సంబంధాలను నిరంతరాయంగా అభివృద్ధిపరచుకోవాలన్నదే తన ప్రభుత్వ స్థిరమైన వైఖరి అని తెలిపారు. ఇరు దేశాల సామ్యవాద లక్ష్యాన్ని సమర్థించడంలో, ప్రోత్సహించడంలో ద్వైపాక్షిక ఒప్పందం బలమైన శక్తిని ప్రదర్శిస్తోందన్నారు. ప్రత్యర్థి శక్తులు మరింత నైరాశ్యంలోకి జారుకున్నాయన్నారు. 


కిమ్ జోంగ్ ఉన్‌కు జీ జిన్‌పింగ్ ఇచ్చిన సందేశంలో,  చైనా-ఉత్తర కొరియా సంబంధాల ప్రగతి దిశను సరైన విధంగా నియంత్రించేందుకు కిమ్‌తో వ్యూహాత్మక సంబంధాలను బలపరచుకుంటామన్నారు., ఇరు దేశాల మధ్య స్నేహ, సహకార సంబంధాలను నూతన దశకు నిదానంగా తీసుకెళ్తామన్నారు. ఈ చర్యల ద్వారా ఇరు దేశాలకు గొప్ప సంతోషాన్ని కలిగించడం తనకు ఇష్టమేనన్నారు. 


1961 జూలై 11న కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం, ఏదైనా దాడి జరిగినపుడు తక్షణమే సైనిక, ఇతర రూపాల్లో ఒకదానికి మరొకటి సహాయపడటానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 


Updated Date - 2021-07-11T17:52:30+05:30 IST