ఇండియన్‌ మార్కెట్లో చైనీస్‌ చెత్త?

ABN , First Publish Date - 2020-03-30T22:08:59+05:30 IST

‘‘చూశావ్‌రా బాబ్జీ ఈ కరోనా ఎఫెక్టు? జనం ఇప్పుడు ఆన్‌లైన్లో వస్తువులు కొనడం బాగా తగ్గిపోయింది. డిజిటల్‌ మార్కెట్లు..

ఇండియన్‌ మార్కెట్లో చైనీస్‌ చెత్త?

రాంజీ : చూశావ్‌రా బాబ్జీ ఈ కరోనా ఎఫెక్టు? జనం ఇప్పుడు ఆన్‌లైన్లో వస్తువులు కొనడం బాగా తగ్గిపోయింది. డిజిటల్‌ మార్కెట్లు మొత్తం డౌన్‌ అయిపోయాయ్‌.


బాబ్జీ : డిజిటల్‌ మార్కెట్లేంట్రా బాబూ? అసలు నిత్యావసరాల గురించే జనం ఇబ్బంది పడుతుంటే? ఇప్పుడు ఆన్‌లైన్లో ఎవరైనా ఫోన్లూ లాప్‌టాప్‌లూ కొంటాడా ఏంటి? కొంటే గింటే ఆ కూరగాయలూ పప్పులూ ఉప్పులూ కొంటున్నారు. అంతే! 


రాంజీ : కానీ ఇంత ఇబ్బందున్నా - మనదేశంలో చైనావాడి మార్కెట్‌ మాత్రం తగ్గలేదు. తెలుసా?


బాబ్జీ : అదేంట్రా?


రాంజీ : అవున్రా. అదే విచిత్రం. చైనావాడు ఇండియాలో చేసే మార్కెట్‌ మాత్రం .. ఏమీ తగ్గలేదు.


బాబ్జీ : దరిద్రుడు... ఆ వైరస్‌ ఒకటి ప్రపంచం మీదకి వదిలాడు. నానా బాధలూ పెట్టాడు. ఇంకా మన మార్కెట్‌ కూడా కావాలా వాడికి? 


రాంజీ : మార్కెట్‌ అంటే ఏంటనుకున్నావ్‌? కరోనా నించి రక్షించుకోడానికి అవసరమయ్యే మాస్కులూ శానిటైజర్లూ అవన్నీ అమ్మేస్తున్నాడు.


బాబ్జీ : ( బ్లింక్‌ )


రాంజీ : ఇండియాలో బ్యాంగ్‌ గుడ్‌, జీక్‌ బైయింగ్‌ ఇలా కొన్ని దిక్కుమాలిన చైనీస్‌ సైట్లు రన్‌ అవుతున్నాయ్‌లే. వాటిలో ఇప్పుడు వాడు ఇండియన్లకి ఏం అమ్ముతున్నాడో తెలుసా? కరోనాని తప్పించుకునేందుకు అవసరమయ్యే సరంజామా అంతా అమ్ముతున్నాడు. 


బాబ్జీ : అమ్ముతున్నాడు కాదు. అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు అను.


రాంజీ : మంచిదే కదరా ఈ సీజన్లో ఇవన్నీ అమ్మడం? 


బాబ్జీ : బావుంది. ఇది ఎలా ఉందంటే... పక్కవాడి కాళ్లిరగ్గొట్టి... వాడికే చక్రాల కుర్చీ అమ్మినట్టుంది. ఈ చైనావాణ్ణి తగలెయ్య!


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )

 



Updated Date - 2020-03-30T22:08:59+05:30 IST