Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 31 Mar 2022 14:22:25 IST

ఐదు నెలల కనిష్టానికి పడిపోయిన చైనా తయారీ...

twitter-iconwatsapp-iconfb-icon
ఐదు నెలల కనిష్టానికి పడిపోయిన చైనా తయారీ...

లండన్ : చైనా తయారీ కార్యకలాపాలు మార్చిలో ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయని అధికారిక సర్వే పేర్కొంది.    యాంటీ-వైరస్ నియంత్రణలు కఠినతరం కావడం ఇందుకు కారణం. కరోనావైరస్ వ్యాప్తితో పోరాడటానికి షాంఘై సహా రెండు పారిశ్రామిక నగరాలు మూసివేత తరువాత చైనా తయారీ కార్యకలాపాలు పడిపోయి. చైనీస్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ అండ్ ఇండస్ట్రీ గ్రూప్, చైనా ఫెడరేషన్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ పర్చేజింగ్ సంబంధిత నెలవారీ కొనుగోలు మేనేజర్ల సూచిక సగం మేర పడిపోయింది.


కొత్త ఆర్డర్‌లు, కొత్త ఎగుమతి ఆర్డర్‌లు, ఉపాధి, ఉత్పత్తి, వ్యాపార అంచనాల ఉప సూచికలు క్షీణించాయి. కోవిడ్ వ్యాప్తి త్వరలో నియంత్రణలోకి వచ్చినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి రావడానికి మరింత సమయం పడుతుందని క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన జూలియన్ ఎవాన్స్-ప్రిట్‌చార్డ్ ఓ నివేదికలో పేర్కొన్నారు. చైనాలోని అత్యధిక జనాభా కలిగిన షాంఘైలోని చాలా వ్యాపారాలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. ఆటోమేకర్‌లు, ఇతర ఫ్యాక్టరీలను మూసివేయవలసి వచ్చింది. మరికొన్ని చిన్న నగరాలపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.