చైనా ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక.. లంకలో డ్రాగన్‌ పెట్టుబడి ఆట ఇదే!

ABN , First Publish Date - 2022-04-06T15:21:00+05:30 IST

శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారింది.

చైనా ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక.. లంకలో డ్రాగన్‌ పెట్టుబడి ఆట ఇదే!

శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలు నిత్యవసర వస్తువులను కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. శ్రీలంక మంత్రులందరూ రాజీనామా చేయగా, ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతోంది. ప్రజలకు తిండి కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి చైనానే కారణమని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ఇంతకీ శ్రీలంక ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వెనుక చైనా హస్తం ఏమిటి? శ్రీలంక సంక్షోభానికి చైనాను ఎందుకు బాధ్యులుగా పరిగణిస్తున్నారనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. శ్రీలంక.. చైనా ఉచ్చులో ఎలా చిక్కుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనాకు ముందు చైనా.. శ్రీలంకలో భారీగా పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకకు రుణాలు ఇచ్చింది. అయితే కరోనా తర్వాత అది భారంగా మారింది. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉన్నత ఉపాధి, ఆదాయం, ఆర్థిక స్థిరత్వం, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో శ్రీలంక... చైనా విదేశీ పెట్టుబడులకు లొంగిపోయింది. ఈ విధంగా శ్రీలంక డ్రాగన్ కంట్రీ చైనాపై ఆధారపడింది. 2022లో శ్రీలంకపై దాదాపు 7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఉంది. ఇప్పుడు చైనా అందించిన రుణం కూడా దానికి జత చేరింది. నిజానికి.. చైనా ఇచ్చే రుణం మౌలిక సదుపాయాల నుండి మైనింగ్ వరకు అన్ని రంగాలలో పెట్టుబడి రూపంలో అందించారు. 




ఈ రుణాన్ని సకాలంలో చెల్లించని పక్షంలో శ్రీలంక.. చైనా ముందు మోకరిల్లక తప్పదని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్థాన్, నేపాల్ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణలుగా గుర్తించవచ్చు. అదేవిధంగా శ్రీలంకలోని పలు ప్రాజెక్టులను చైనా ఆక్రమించుకుంది. శ్రీలంక అప్పుల్లో కూరుకుపోయినందున చాలా ప్రాజెక్టులు లీజుకు వెళ్లాయి. దీంతో శ్రీలంక క్రమంగా ఆర్థికంగా పతనానికి చేరుకుంది. శ్రీలంక ప్రభుత్వం తన సరళీకరణ విధానంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 1980ల నుండి తన విదేశీ పెట్టుబడి విధానాలను అవలంబిస్తోంది. ఈ విధానాలతో చైనా చాలా లాభపడింది. శ్రీలంక అవసరాలను చైనా తనకు అనువుగా పరిగణించింది. కాగా ప్రతి దేశ ఆర్థిక పరిస్థితి కరోనావైరస్ కారణంగా ప్రభావితమైంది. ఈ నేపధ్యంలో శ్రీలంక మరింతగా ప్రభావితమైంది. దీనికి కారణం శ్రీలంకకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం పర్యాటకం నుండి వస్తుంది. కరోనా కారణంగా ప్రయాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. గేట్‌వే నివేదిక ప్రకారం, 2005-2015 మధ్యకాలంలో శ్రీలంకలో అధికారిక అభివృద్ధి సహాయం (ఓడీఏ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎప్డీఐ) ప్రధాన వనరుగా చైనా ఉద్భవించింది. ఇందులో చాలా వరకు రుణాలు ఓడీఏ రూపంలో ఉన్నాయి. శ్రీలంకలో చైనా అనేక ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి, అభివృద్ధి మొదలైన వాటిపై దృష్టి సారించారు. ఈ విధంగా శ్రీలంకలో చైనా తన అడుగులు వేస్తూ వచ్చిది. 2005 సంవత్సరంలో శ్రీలంకలో చైనా ఎఫ్‌డిఐ $16.4 మిలియన్లు. అంటే ఈ మొత్తం శ్రీలంక ఎఫ్‌డిఐలో ​​1% కంటే తక్కువగా ఉంది. 2015 సంవత్సరం నాటికి, చైనీస్ ప్రైవేట్ పెట్టుబడి $338 మిలియన్లకు చేరుకుంది. ఇది శ్రీలంక  మొత్తం ఎఫ్డీఐలో 35%గా ఉంది. 

Updated Date - 2022-04-06T15:21:00+05:30 IST