అమెరికా నుంచి చైనా వచ్చిన రొయ్యలు.. కరోనా పాజిటివ్ అని తేలడంతో..

ABN , First Publish Date - 2020-07-11T22:54:44+05:30 IST

దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశం నుంచి చైనాకు ఇటీవల వందల టన్నుల రొయ్యలు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం..

అమెరికా నుంచి చైనా వచ్చిన రొయ్యలు.. కరోనా పాజిటివ్ అని తేలడంతో..

బీజింగ్: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశం నుంచి చైనాకు ఇటీవల వందల టన్నుల రొయ్యలు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం వీటన్నిటినీ ఓడరేవు వద్దే నిలిపివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. రొయ్యలను నిల్వచేసిన అతిశీతల ప్యాకేజీపై కరోనా వైరస్ ఉడడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు కస్టమ్స్ అధికారి బీ కెక్సిన్ మాట్లాడుతూ, వెలుపలి, లోపలి  ప్యాకేజింగ్‌లపై కరోనాను గుర్తించామని వెల్లడించారు. దీంతో ఈక్వెడార్‌లోని మూడు రొయ్యల ఉత్పత్తి ప్లాంట్ల నుంచి వచ్చిన సరుకును ఓడరేవులోనే నిలిపివేశామని తెలిపారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందా, లేదా అనే విషయాలను పక్కన పెడితే ఆ కంపెనీలు పాటిస్తున్న ఆహార భద్రత నియమాలలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయని కెక్సిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీజింగ్‌లోని ఓ మార్కెట్‌లో సాల్మన్ చేపలను కోయడానికి ఉపయోగించిన చెక్కపై కరోనా వైరస్‌ ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తోంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తుల విషయంలో కచ్చితమైన ప్రమాణాలను అనుసరిస్తోంది.

Updated Date - 2020-07-11T22:54:44+05:30 IST