Chinaలో వెల్లువెత్తిన వరదలు...12 మంది మృతి

ABN , First Publish Date - 2022-07-18T13:33:11+05:30 IST

చైనా దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.ఈ వరద విపత్తు వల్ల 12 మంది మృతి...

Chinaలో వెల్లువెత్తిన వరదలు...12 మంది మృతి

షాంఘై: చైనా దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.ఈ వరద విపత్తు వల్ల 12 మంది మృతి చెందారు.వరదల వల్ల పలు జనవాసాలు జలమయం కావడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని కింగ్‌యాంగ్‌లోని నది వెంబడి వరద నీటిలో వంతెన కొట్టుకుపోయింది. వరదనీటిలో కొట్టుకుపోయిన వంతెన సమీపంలో ఒక వాహనం కనిపించింది.నైరుతి,వాయువ్య చైనాలో ఆకస్మిక వరదల వల్ల 12 మంది మృతి చెందారు.నైరుతి ప్రావిన్స్ సిచువాన్‌లో కుండపోత వర్షం, ఆకస్మిక వరదల కారణంగా ఆరుగురు మరణించారు. మరో 12 మంది తప్పిపోయినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు.


చైనాలో 1,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. గన్సు వాయువ్య ప్రావిన్స్‌లోని లాంగ్నాన్ నగరంలో 3వేల మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. రెండురోజుల్లోనే  98.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వాతావరణ మార్పుల కారణంగా భారీవర్షాలు కురుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెచ్చని గాలి నీటిని నిల్వ చేస్తుందని, ఇది విడుదలైనప్పుడు పెద్ద మేఘావృతాలకు దారితీస్తుందని నిపుణులు చెప్పారు.


Updated Date - 2022-07-18T13:33:11+05:30 IST