బీజింగ్: చైనా విమాన ప్రమాదానికి గల కారణం తెలిసిందని చైనా ఏవియేషన్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. బుధవారం విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభించడంతో ఆ బాక్స్ డేటా ఆధారంగా వివరాలు సేకరించగా విమానం ధ్వని వేగానికి సమీపంగా ప్రయాణించిందని, అనంతరం వెళ్లి కొండను ఢీకొట్టిందని వారు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ విమాన ప్రమాదం జరిగిన తీవ్రత వల్ల ఆధారాలు లభించడం కష్టం అవుతోంది. అయితే బుధవారం కొనసాగిన గాలింపుల్లో విమానం బ్లాక్ బాక్స్ లభించినట్లు చైనా ఏవియేషన్ అథారిటీ అధికారి ఒకరు పేర్కొన్నారు. విమానం గంటకు 960కి పైగా కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని ఒకానొక సమయంలో 1,000 కిలోమీటర్లకు ప్రయాణ వేగం పెరిగిందని అంటున్నారు. ఫ్లైట్ట్రేడర్ 24 నుంచి తీసిన డేటా ఆధారంగా ఈ వివరాలు కనుకున్నట్లు మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆస్ట్రోనాటిక్స్ అండ్ ఆరోనాటిక్స్ ప్రొఫెసర్ జాన్ హన్స్మన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
బోయింగ్ 737-800 ఎంజీ అనే విమానంలో 123 మంది ప్రయాణికులు సహా తొమ్మిది మంది సిబ్బంది ప్రయాణిస్తుండగా ఘోర ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు ఒక్కరి ఆచూకీ కూడా లభించలేదు. 2,000 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వారంతా చనిపోయి ఉంటారని చైనా అధికారులు నిర్ధారణకు వచ్చారు. చైనాలో 2010 తర్వాత ప్రయాణికుల విమానం కూలిపోవడం ఇదే తొలిసారి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే. 2010లో చైనాలోని యిచున్ ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనలో 42 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి