China Fires Missiles: జపాన్ జలాల్లోకి చైనా క్షిపణుల ప్రయోగం.. కలకలం

ABN , First Publish Date - 2022-08-05T01:49:03+05:30 IST

తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan) పర్యటనపై మండిపడుతోన్న చైనా (China) చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది.

China Fires Missiles: జపాన్ జలాల్లోకి చైనా క్షిపణుల ప్రయోగం.. కలకలం

తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి (US House of Representatives Speaker Nancy Pelosi) తైవాన్‌ (Taiwan) పర్యటనపై మండిపడుతోన్న చైనా (China) చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. తైవాన్‌కు అన్ని వైపులా సైనిక విన్యాసాలు చేస్తోన్న చైనా తాజాగా జపాన్ (Japan) జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తాజాగా నాన్సీ పెలోసి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో తమ జలాల్లోకి చైనా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంపై జపాన్ కన్నెర్ర చేసింది. దౌత్య మార్గాల ద్వారా చైనాకు తీవ్ర నిరసన తెలియజేసింది. తమ దేశ భద్రతను ప్రశ్నించేలా చైనా దుందుడుకు చర్యలకు పాల్పడటం తగదని హెచ్చరించింది. 


ఇలా ఉంటే చైనా ప్రయోగించిన మొత్తం 11 క్షిపణులు తైవాన్ జలాల్లో నలు దిక్కులా పడ్డాయి. 


పెలోసీ తైవాన్ పర్యటన నెపంతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (Peoples Liberation Army) పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమౌతూ చుట్టుపక్కల దేశాలకు గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా అమెరికాకు, దాని మిత్రపక్ష దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే యుద్ధం తప్పదని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.      

Updated Date - 2022-08-05T01:49:03+05:30 IST