గాడిలోకి చైనా ఆర్థిక వ్యవస్థ

ABN , First Publish Date - 2020-10-20T05:41:03+05:30 IST

చైనా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పరుగులు పెడుతోంది. కరోనా కష్టాలను అధిగమించి, గత ఆరు నెలల్లో చైనా మళ్లీ సానుకూల జీడీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే చైనా జీడీపీ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన....

గాడిలోకి చైనా ఆర్థిక వ్యవస్థ

బీజింగ్‌ : చైనా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పరుగులు పెడుతోంది. కరోనా కష్టాలను అధిగమించి, గత ఆరు నెలల్లో చైనా మళ్లీ సానుకూల జీడీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే చైనా జీడీపీ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 3.2 శాతం, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 4.9 శాతంగా నమోదైంది. రిటైల్‌ ఖర్చులు మళ్లీ కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయి. మాస్కులు, వైద్య పరికరాల ఎగుమతి ఆర్డర్లతో చైనా ఫ్యాక్టరీల్లో మళ్లీ పెద్ద ఎత్తున సందడి కనిపిస్తోంది. అమెరికా, యూరప్‌, జపాన్‌, భారత్‌ తరహాలో ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించకుండానే చైనా ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ నుంచి కోలుకోవడం విశేషం. మరోవైపు అమెరికా, ఐరోపా ఆర్థిక సమాజం (ఈయూ) దేశాలు మాత్రం ఇంకా కొవిడ్‌ ప్రభావం నుంచి కోలుకోలేదు.  


నిజాలు దాచొద్దు :  కేంద్ర ప్రభుత్వం కీలక ఆర్థిక గణాంకాలను దాస్తోందన్న విమర్శలపై ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలని కోరారు. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటులో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలు కూడా భారత్‌ను మించిపోతాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తోందన్నారు. 

Updated Date - 2020-10-20T05:41:03+05:30 IST