Abn logo
Jun 3 2020 @ 08:07AM

కరోనాపై ముందే తెలిసినా హెచ్చరించని డ్రాగన్‌ కంట్రీ

జనవరి 2 నాటికే వైరస్‌ డీకోడింగ్‌ పూర్తి

వెల్లడించవద్దంటూ పరిశోధకులకు ఆదేశాలు

అసోసియేటెడ్‌ ప్రెస్‌ పరిశోధనలో 

సంచలన విషయాలు వెల్లడి

వాషింగ్టన్‌, జూన్‌ 2: డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నదే నిజమైందా? కరోనా వైరస్‌ గురించి చైనాకు ముందునుంచే తెలిసినా ప్రపంచానికి చెప్పకుండా దాచిందా? అవునంటోంది అమెరికా వార్తాసంస్థ ‘అసోసియేట్‌ ప్రెస్‌(ఏపీ)’. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంతర్గత డాక్యుమెంట్లు, ఈమెయిల్స్‌, ఇంటర్వ్యూలు తమ చేతికి చిక్కాయని, వాటి ఆధారంగా పలు సంచలన విషయా లు తెలిశాయంటూ ఏపీ ఒక నివేదికను ప్రచురించింది. దాని ప్రకారం.. గత ఏడాది డిసెంబరులోనే వూహాన్‌లో అర్థంకాని న్యూమోనియాతో పలువురు రోగులు ఆస్పత్రుల్లో చేరారు. వారి నమూనాలను విజన్‌ మెడికల్స్‌ అనే సంస్థ పరిశీలించి సార్స్‌ను పోలిన కొత్త వైరస్‌ దాడి చేస్తోందని గత ఏడాది డిసెంబరు 27న గుర్తించింది. వూహాన్‌లోని షి జెంగ్లీ అనే కరోనా వైరస్‌ నిపుణురాలికి ఈ సమాచారం అందించగా.. ఈ ఏడాది జనవరి 2కల్లా వైరస్‌ జన్యువును డీకోడ్‌ చేయగలిగారు.


కానీ ప్రపంచంతో పంచుకోవడంలో మాత్రం చైనా తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపించింది. తమ అనుమతి లేకుండా వైరస్‌ గురించిన ఏ సమాచారమూ బయటికి రావడాని కి వీల్లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ఆదేశించిం ది. జనవరి 5న మరో రెండు ప్రభుత్వ ల్యాబ్‌లు, షాం ఘైలోని ఒక ల్యాబ్‌ వైర్‌సను డీకోడ్‌ చేశాయి. ఇది అంటువ్యాధి కావచ్చని జెంగ్లీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయినా పరీక్షల్ని, ఔషధాల్ని, వాక్సిన్‌లను రూపొందించేందుకు అవసరమైన వివరాల్ని చైనా తొక్కిపెట్టింది. ఎట్టకేలకు జనవరి 11న ఒక చైనా ల్యాబ్‌ వైరస్‌ జన్యు వివరాలను వైరాలజీ వెబ్‌సైట్‌లో ప్రచురించిన తర్వాత, చైనా వైద్యారోగ్య అధికారులు జన్యుపటా న్ని విడుదల చేశారు. అయితే.. అప్పుడు కూడా చైనా ప్రభుత్వం మరో 2 వారాల పాటు ఆ పటాన్ని ప్రపంచానికి అందనివ్వకపోవడం గమనార్హం. అప్పటికే వైరస్‌ విజృంభణ 200ు పెరిగింది. చైనా ముందుగానే వైరస్‌ జన్యువు వివరాల్ని పంచుకుని ఉంటే.. కరోనా ప్రభావం సగానికి సగం మేర తగ్గి ఉండేదని ఏపీ పేర్కొంది.


పైపైకే పొగిడిన డబ్ల్యూహెచ్‌వో

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. చైనా వివరాలు ఇవ్వకపోయినా, జనవరిలో డబ్ల్యూహెచ్‌వో ఆ దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది. పైకి పొగిడినా చైనా పూర్తి సమాచారాన్ని పంచుకోవడం లేదని, ప్రపంచానికి విలువైన సమయాన్ని ఆ దేశం వృథా చేస్తోందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసేది. సంస్థ సమావేశాల తాలూకు వివరాల్లో ఈ విషయాలు లభ్యమయ్యాయి. చైనాను డిమాండ్‌ చేసేంత అధికారం డబ్ల్యూహెచ్‌వోకు లేదు. అందుకే చైనాను బతిమాలుకుంటూ వచ్చింది.

Advertisement
Advertisement
Advertisement