ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ చైనా చెడుగుడు..? ట్రంప్ ఆరోపణలు నిజమేనా..

ABN , First Publish Date - 2020-06-02T23:27:23+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించడంలో ఆలస్యం చేసిన చైనా

ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ చైనా చెడుగుడు..? ట్రంప్ ఆరోపణలు నిజమేనా..

వాషింగ్టన్: అబ్బో.. కరోనా కట్టడి చర్యల్లో చైనా భేష్. ఈ మహమ్మారికి సంబంధించిన సమాచారన్ని ఆ దేశం ప్రపంచంతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. సంక్షోభం నివారించేందుకు వేగంగా కదులుతోంది. ఇవి.. జనవరిలో చైనాపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ కురిపించిన పొగడ్తలు. మరి ఇదంతా నిజమేనా.? అంటే కాదని ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓకి కూడా చైనా చుక్కులు చూపించిందట. కరోనాకు సంబంధించి సంస్థ కోరిన సమాచారాన్ని సరైన సమాయానికి ఇవ్వకుండా తెగ ఇబ్బందులు పాలు చేసిందట. అంతర్జాతీయం సమాజం ముందు చైనాను పొగుతున్నప్పటికీ సంస్థ అంతర్గత సమావేశాల్లో మాత్రం డబ్ల్యూహెచ్ఓ అధికారులు చైనా సహాయ నిరాకరణ వల్ల అవస్థలు పడుతున్నామని వాపోయేవారట. టీవీలల్లో టెలికాస్ట అయ్యే 15 నిమిషాల మందు చైనా తమకు కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అందించేదని ఆవేదన వ్యక్తం చేసేవారట. జనవరి తొలనాళ్లలోనే కరోనా వైరస్ జన్యుక్రమాన్ని చైనా ప్రభుత్వ పరిశోధన సంస్థలు తెలుసుకున్నప్పటికీ వాటి వివరాలు బయటకి పొక్కకుండా అవి జాగ్రత్త పడ్డాయట. మరో వైలారలజీ వెబ్ సైట్ జన్యుక్రమం ప్రచురితమైన తరువాతే చైనా ప్రభుత్వం ఈ సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓకు అందిచ్చిందని తెలిసింది. ఆ తరువాత కూడా చైనా తీరులో ఎటువంటి మార్పూ రాలేదని సమాచారం. కరోనా తొలినాళ్లలో ఉండగా.. చైనాలోని రోగుల సంఖ్య గురించిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓకు అందకుండా చైనా ఆలస్యం చేసిందని తెలిసింది. దీని వల్ల కరోనా ప్రభావం ప్రపంచంపై ఎంత ఉంటుందో అంచనా వేయడంలో డబ్ల్యూహెచ్ఓకు ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం. ఈ కారణంగా సంక్షోభాన్ని తొలినాళ్లలోనే అదుపు చేసే అమూల్యమైన అవకాశాన్ని ప్రపంచ కోల్పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్న డబ్లూహెచ్ఓ అధికారులు మాత్రం చైనాను పోగుతూ వచ్చారట. మెల్లగా బతిమాలుతూ, బుజ్జగిస్తూ చైనా నుంచి సమాచారం రాబట్టాలనుకుని వారు ఈ వ్యూహాన్ని అవలంబించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో చైనా కారణంగానే ప్రపంచం కరోనా సంక్షభాన్ని ఎదుర్కొంటోందనే అమెరికా వాదనకు మరింత బలం చేకురినట్టైంది.

Updated Date - 2020-06-02T23:27:23+05:30 IST