30 ఏళ్ల తర్వాత భారత్‌ నుంచి బియ్యం కొన్న చైనా

ABN , First Publish Date - 2020-12-03T08:17:26+05:30 IST

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌ నుంచి చైనా బియ్యం కొనుగోలును ప్రారంభించింది.

30 ఏళ్ల తర్వాత భారత్‌ నుంచి బియ్యం కొన్న చైనా

ముంబై, డిసెంబరు 2: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌ నుంచి చైనా బియ్యం కొనుగోలును ప్రారంభించింది. కొద్ది నెలలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న తరుణంలో భారత్‌ నుంచి చైనా బియ్యం కొనుగోలు చేయడం విశేషం. డిసెంబరు-ఫిబ్రవరి షిప్‌మెంట్‌లో టన్నుకు 300 డాలర్ల చొప్పున లక్ష టన్నుల బియ్యం ఎగుమతి చే యాలని చైనా వ్యాపారులు కోరారని బియ్యం ఎగుమతిదారుల సంఘం అఽ ద్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు. నాణ్యతను పరిశీలించిన తర్వాత దిగుమతులను చైనా మరింత పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్‌తో పోలిస్తే థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌, పాకిస్థాన్‌ టన్నుకు 30 డాలర్లు ఎక్కువగా చైనాకు బియ్యం సరఫరా చేస్తున్నాయన్నారు. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు భారత్‌ కాగా చైనా అతిపెద్ద దిగుమతిదారు. 

Updated Date - 2020-12-03T08:17:26+05:30 IST