రేటు తగ్గిపోయిన ఫోల్డింగ్‌ ఫోన్‌ : కరోనా వేళ చైనా కమర్షియల్‌ ట్రిక్‌

ABN , First Publish Date - 2020-04-12T00:49:33+05:30 IST

ఏరా బాబ్జీ ఇది విన్నావా? కొన్ని కాస్ట్‌లీ ఫోన్లు ఇప్పుడు యమా చీప్‌గా దొరికేస్తున్నాయట.

రేటు తగ్గిపోయిన ఫోల్డింగ్‌ ఫోన్‌ : కరోనా వేళ చైనా కమర్షియల్‌ ట్రిక్‌

టెక్‌ టాక్‌ : కాస్ట్‌లీ ఫోన్‌ చీప్‌ అయిపోయిన వేళ...


రాంజీ : ఏరా బాబ్జీ ఇది విన్నావా? కొన్ని కాస్ట్‌లీ ఫోన్లు ఇప్పుడు యమా చీప్‌గా దొరికేస్తున్నాయట.

బాబ్జీ : బావుంది. ఇప్పుడు ఫోన్లెవడికి కావాల్రా. ముందు ఈ కరోనా నించి బయటపడనీ.


రాంజీ : పడతాం లేరా. నేను చెప్పే ఫోన్‌ మామూలు ఫోన్‌ అనుకున్నావా ఏంటి? ఫోల్డింగ్‌ ఫోన్‌... నువ్వు చాలా క్రేజీగా ఎదురు చూసేవాడివి... ఆ మడత ఫోన్‌ గురించి నేను చెప్పేది ...

బాబ్జీ : లోకమే మడతడిపోతుంటే... మడత ఫోన్‌ పిడత ఫోన్‌ అంటావేంట్రా నువ్వు? కాసేపు టెక్నాలజీ సోది చెప్పకు.


రాంజీ : అదేంట్రా మనిద్దరం కూర్చున్నదే టెక్నాలజీ గురించి మాట్లాడుకోడానికి... సోది అంటావేంటి?

బాబ్జీ : సరే. టెక్నాలజీ గురించే మాట్లాడుకుందాం. ముందు ఆ కరోనాకి ఎవడైనా మందు కనిపెడితే చెప్పు. ముందు ఆ మెడికల్‌ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. సరే, ఇంతకీ ఏ ఫోను గురించి నువ్వు చెప్పేది?


రాంజీ : అదేరా... ఫోల్డబుల్‌ ఫోన్‌... హ్యువావీ ఫోనుంది కదా?

బాబ్జీ : హ్యువావీనా? ఒరేయ్‌. సీరియస్‌గా చెబుతున్నా. కొంతకాలం పాటు ఆ చైనా గురించిగానీ.. ఆ చైనా ఫోన్‌ బ్రాండ్ల గురించిగానీ.. మాట్లాడావంటే మాత్రం మర్యాద దక్కదు.


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )

రాంజీ : నే చెప్పేది హ్యువావీ మేట్‌ ఎక్సెస్‌ గురించిరా... Huawei Mate Xs ... మొన్నటిదాకా అదే కొంటాను అనేవాడివి.. మడత ఫోన్లలో అదే మహా గొప్పదని మెచ్చుకునేవాడివి...

బాబ్జీ : అదంతా అప్పుడులేవోయ్‌. ఇప్పుడు ఇంట్రస్ట్‌ లేదు. ఇంతకీ ఏంటట వాడి సంగతి?


రాంజీ : ఆ హ్యువావీ వాడు - మడత ఫోన్లని మహా చీప్‌ గా అమ్మేశాడట.

బాబ్జీ : మరేం చేస్తాడు? అమెరికా మార్కెట్‌ అంతా పడిపోయిందిగా? అందినంతకే అమ్ముకోవాలి మరి. అసలీ సంక్షోభం టైములో ఫోన్‌ కొన్నోణ్ణి మెచ్చుకోవాల్రా రాంజీ!


రాంజీ : అవున్రా బాబ్జీ. జనరల్‌ గా క్రేజ్‌ ఉన్న ఫోనేదైనా రిలీజ్‌ చేస్తే... కంపెనీకి కుప్పలు తెప్పలుగా లాభాలొస్తాయ్‌. కానీ ఈ మడత ఫోన్‌కి లాభాలు రాకపోగా... విపరీతంగా ఖర్చు మాత్రం మిగిలిందట.

బాబ్జీ : అయితే హ్యువావీ వాడు బాగా నష్టపోయాడంటావ్‌?


రాంజీ : మరి నష్టం కాదేంట్రా? అంత గొప్ప ఫోన్లని అనుకున్నదానికంటే తక్కువకి అమ్ముకోవడం వల్ల ఆరుకోట్ల డాలర్ల నష్టం వచ్చిందట కంపెనీకి!

బాబ్జీ : ఓస్. ఆరుకోట్ల డాలర్లేనా? ఇంకా ఎక్కువ నష్టం వచ్చి ఉండాలే.


రాంజీ : లేదురా. నిజానికి ఎక్కువ నష్టమే వచ్చి ఉండాలి. కానీ సంక్షోభం కదా ? అందుకే ముందు అనుకున్నన్ని ఫోన్లు మార్కెట్లో రిలీజ్‌ చేయలేదట. ఏదో కొద్దిగా మాత్రం స్టాక్‌ వదిలాడు.

బాబ్జీ : చూశావా? అదీ వాడి తెలివి. రేపు అంతా సర్దుకున్నాక అసలు రేటుతో మిగిలిన స్టాక్‌ బయటికి తీస్తాడు. చైనావాడా మజాకా?


రాంజీ : అయితే ఏంటంటావ్‌ వాడి స్ట్రాటజీ ఇలా చేయడం వెనక?

బాబ్జీ : ఏముందీ? కరోనా సీజన్లో కూడా మా కంపెనీ కరెక్ట్‌ టైమ్‌కి ఫోన్లు రిలీజ్‌ చేసేస్తోంది. మేం ఎంత గొప్పో చూడండని చెప్పుకోడానికి.. కంపెనీకి బ్రాండ్‌ వాల్యూ పడిపోకుండా చూసుకోడానికి... అదీ!


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )



Updated Date - 2020-04-12T00:49:33+05:30 IST