చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపునివ్వవచ్చు, కానీ..: భగవత్

ABN , First Publish Date - 2021-08-15T20:48:11+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు వేశారు. చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపునివ్వవచ్చని అభిప్రాయపడ్డారు.

చైనా వస్తువుల బహిష్కరణకు పిలుపునివ్వవచ్చు, కానీ..: భగవత్

నాగపూర్: స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు వేశారు. చైనా వస్తువుల బహిష్కరణకు మనం పిలుపునివ్వవచ్చని, కానీ మనం వాడే ప్రతిదీ ఎక్కడ నుండి వస్తుంది? అని ప్రశ్నించారు. చైనాపై ఆధారపడటం పెరిగితే, మనము వారి ముందు తలవంచాల్సి వస్తుందన్నారు. స్వదేశీ అంటే అన్నీ వదిలేయడం కాదని, అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. మన నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ టెక్నాలజీ కోసం మనం స్వయం ఆధారితంగా ఉండాలని తెలిపారు. స్వావలంబన ఉపాధిని సృష్టిస్తుందని, లేకపోతే, మన ఉద్యోగాలు పోతాయని, హింసకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. స్వదేశీ అంటే స్వావలంబన, అహింస అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-15T20:48:11+05:30 IST