బజాజ్ ఫైనాన్స్‌లో చైనా బ్యాంకు పెట్టుబడులు

ABN , First Publish Date - 2020-09-22T01:10:35+05:30 IST

పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ... భారత్‌లోని అతిపెద్ద ఎన్బీఎఫ్‌సీల్లో ఒకటైన బజాజ్ ఫైనాన్స్‌లో ఈక్విటీని ఇన్వెస్ట్ చేసింది. కరోనా, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, చైనా యాప్‌ల నిషేధం తదితర పరిణామాల సమయంలో చైనా సెంట్రల్ బ్యాంకు... గతంలో హెడీఎఫ్‌సీ లో పెట్టుబడులు పెట్టడం ఆర్థిక మార్కెట్లో గతంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

బజాజ్ ఫైనాన్స్‌లో చైనా బ్యాంకు పెట్టుబడులు

న్యూఢిల్లీ :  పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ... భారత్‌లోని అతిపెద్ద ఎన్బీఎఫ్‌సీల్లో ఒకటైన బజాజ్ ఫైనాన్స్‌లో  ఈక్విటీని ఇన్వెస్ట్ చేసింది. కరోనా, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, చైనా యాప్‌ల నిషేధం తదితర పరిణామాల సమయంలో చైనా సెంట్రల్ బ్యాంకు... గతంలో హెడీఎఫ్‌సీ లో పెట్టుబడులు పెట్టడం ఆర్థిక మార్కెట్లో గతంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.


ఇదే క్రమంలో... కిందటి నెలలో కూడా  మరో ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ  లో కూడా న్వెస్ట్ చేసినట్లు వెల్లడైంది. కాగా...  ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. కాగా... భారత్‌లోని ఆర్థిక సంస్థల్లో చైనా బ్యాంకు ఇన్వెస్ట్ చేయడం ఇది మూడోది. మార్చిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తన వాటాను ఒక శాతం కంటే ఎక్కువకు పెంచుకుంది. ఆ తర్వాత ఐసీఐసీలో కూడా  ఇన్వెస్ట్ చేసింది.


హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్‌లో చైనా బ్యాంకు ఇన్వెస్ట్ చేసింది తక్కువ మొత్తమే అయినప్పటికీ ప్రస్తుత  పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం ఆందోళన కలిగించే అంశమేనన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. వాస్తవానికి... బ్యాంకింగ్ రంగంలో ఏ పెట్టుబడిదారైనా కూడా... పదిహేను శాతానికి మించి పెట్టలేరు. కేవలం ఐదు శాతానికి మించి పెడితే ఆర్బీఐ అమోదం తప్పనిసరి. 


Updated Date - 2020-09-22T01:10:35+05:30 IST