ఆ చైనా యాప్‌ల ఖేల్‌.. ‘శాశ్వతం’గా ఖతం!

ABN , First Publish Date - 2021-01-27T06:52:11+05:30 IST

టిక్‌టాక్‌ ఆటను కేంద్ర ప్రభుత్వం ‘శాశ్వతం’గా కట్టించిందా?.. వీచాట్‌పైనా ఇదే వేటు వేసిందా?.. పబ్జీతో కలిపి దాదాపు 200

ఆ చైనా యాప్‌ల ఖేల్‌.. ‘శాశ్వతం’గా ఖతం!

న్యూఢిల్లీ, జనవరి 26: టిక్‌టాక్‌ ఆటను కేంద్ర ప్రభుత్వం ‘శాశ్వతం’గా కట్టించిందా?.. వీచాట్‌పైనా ఇదే వేటు వేసిందా?.. పబ్జీతో కలిపి దాదాపు 200 యాప్‌లు భారత్‌లో తెరమరుగేనా?.. వీటికి ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చర్యలు అవుననే సమాధానం చెబుతున్నాయి. టిక్‌టాక్‌తో కలిపి 59 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ గత ఏడాది జూన్‌లో కేంద్రం నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వాటిని ‘శాశ్వతం’గా నిలిపివేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సమాచార సేకరణ, వినియోగంపై ఆ యాప్‌లను వివరణ కోరిన కేంద్రం.. వాటి సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఇక, గత ఏడాది దాదాపు 200 యాప్‌లపై నిషేధం వేటు పడింది. వాటిపై కూడా ‘శాశ్వత’ దెబ్బ పడనుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2021-01-27T06:52:11+05:30 IST