చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌

ABN , First Publish Date - 2021-12-18T18:00:56+05:30 IST

మైదా - మూడుకప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయ - ఒకకప్పు(సన్నగా తరిగినది), కరివేపాకు

చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌

కావలసినవి: మైదా - మూడుకప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయ - ఒకకప్పు(సన్నగా తరిగినది), కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - తగినంత, పంచదార - రెండు టీస్పూన్లు, బేకింగ్‌పౌడర్‌ - అరటీస్పూన్‌, నెయ్యి - రెండు టీస్పూన్లు, నూనె - రెండు టీస్పూన్లు, నీళ్లు - తగినన్ని.


తయారీ విధానం: ఒక బౌల్‌లో మైదా తీసుకుని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పంచదార, బేకింగ్‌ పౌడర్‌, తగినంత ఉప్పు వేసి, నెయ్యి, నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్దికొద్దిగా పోసుకుంటూ కలియబెట్టాలి. తరువాత మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పొడి పిండి అద్దుతూ రోల్‌ చేసుకోవాలి. చపాతీ సైజులో చేసుకున్న తరువాత చిన్నసైజు టిఫిన్‌ బాక్స్‌తో లేక రౌండ్‌ కటర్‌ సహాయంతో కట్‌ చేసుకోవాలి. ఎంత సైజులో ఉండాలో మీ ఇష్టం. ఫోర్క్‌ సహాయంతో కొన్ని రంధ్రాలు చేస్తే బేకింగ్‌ సమయంలో పొంగకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న క్రాకర్స్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్‌ చేసిన ఓవెన్‌లో ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. ఈ క్రాకర్స్‌ వారం రోజుల పాటు నిలువ ఉంటాయి. సాయంత్రం స్నాక్స్‌గా వీటిని ఆస్వాదించవచ్చు.

Updated Date - 2021-12-18T18:00:56+05:30 IST