పండుమిర్చి - చికెన్‌ ఫ్రై

ABN , First Publish Date - 2021-01-30T19:56:51+05:30 IST

చికెన్‌ - పావుకేజీ, పసుపు - అర టీస్పూన్‌, ధనియాలపొడి - అర టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత,

పండుమిర్చి - చికెన్‌ ఫ్రై

కావలసినవి: చికెన్‌ - పావుకేజీ, పసుపు - అర టీస్పూన్‌, ధనియాలపొడి - అర టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పండుమిరిపకాయలు - ఏడు, టొమాటో - ఒకటి, నూనె - సరిపడా, దాల్చినచెక్క - చిన్నముక్క, లవంగాలు - మూడు, యాలకులు - రెండు, గరంమసాలా - అరటీస్పూన్‌, పుదీన - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, జీడిపప్పు - పది పలుకులు.


తయారీ విధానం: ఒక పాత్రలో శుభ్రంగా కడిగిన చికెన్‌ తీసుకుని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, పెరుగు, ధనియాల పొడి వేసి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి. పండుమిరపకాయలు, టొమాటోను మిక్సీలో వేసి పేస్టు మాదిరిగా గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి కలపాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. పసుపు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు మారినేట్‌ చేసిన చికెన్‌ వేసి ఉడికించాలి. చికెన్‌ ఉడికిన తరువాత ధనియాల పొడి, గరంమసాలా, పుదీనా వేసి కలపాలి. చివరగా కొత్తిమీర, జీడిపప్పుపలుకులు వేసి దింపాలి.  


Read more