విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో చిల్లకొండయ్యపల్లి ఘటన

ABN , First Publish Date - 2022-07-02T05:28:30+05:30 IST

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం తోనే శ్రీసత్యసాయి జిల్లా చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై విద్యుత్‌ తీగలు తెగిపడిన ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనం అయ్యారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో చిల్లకొండయ్యపల్లి ఘటన
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న రమే్‌షనాయుడు

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు 


కడప మారుతీనగర్‌, జూలై 1: విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం తోనే శ్రీసత్యసాయి జిల్లా చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై విద్యుత్‌ తీగలు తెగిపడిన ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనం అయ్యారని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగం మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణం మాఫియా వల్లే అన్నారు. శుక్రవారం కడపలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనం దిశగా సాగుతోందన్నారు. ఆ కోవలో విద్యుత్‌ రంగం అవినీతి ఊబిలో చిక్కుకుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. చిల్లకొండయ్యపల్లి దుర్ఘటనలో సంబంధిత విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉడుతను బూచిగా చూపించడం పట్ల సామాన్య ప్రజలు సైతం ముక్కుమీద వేలు వేసుకుంటున్నారన్నారు. గతంలో రథ ం దహనం కావడానికి తేనేటీగలు కారణమని, ప్రభుత్వ దుకాణంలో మద్యం మాయమైన సంఘటనలో ఎలుకలు కారణమని వైసీపీ నేతలు, అధికారులు చెప్పడాన్ని ప్రజలు నవ్విపోతున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అబద్దపు మాటలు విడనాడకపోతే ప్రజలు రానున్న ఎన్నికల్లో వైసీపీని పాతాళగంగలో కలపడం తథ్యమన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బాలకృష్ణయాదవ్‌, లక్ష్మణరావు, నాయకులు కేశవ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T05:28:30+05:30 IST