కంట్లో కారం

ABN , First Publish Date - 2021-04-16T05:20:28+05:30 IST

మిరప రైతులు దగా పడుతున్నారు.

కంట్లో కారం
మిరపను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

- ఆగమవుతున్న మిరప రైతులు

- మార్కెట్‌ సౌకర్యం కరువు

- తక్కువ ధరకు పంటను కొంటున్న దళారులు

- ఆమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు


గద్వాల, ఏ ప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : మిరప రైతులు దగా పడుతున్నారు. దళారు ల చేతికి చిక్కి నిలువునా మోసపోతున్నారు. ఆరుగాలం కష్టించి పడించిన పంటకు ఓ వై పు గిట్టుబాటు ధర రాక, మరో వైపు వచ్చిన దిగుబడులను దళారులకు తక్కువ ధరకే అ మ్ముతూ తీవ్రంగా నష్టపోతున్నారు. మిరప పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌ సౌక ర్యం కల్పించాలని ఏళ్లుగా డిమాండ్‌ చేస్తు న్నా పాలకులు, అధికారులు పెడచెవిన పె డుతూ దళారులకు సహకారం అందిస్తున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల, మానవపాడు, మల్దకల్‌ మండలాల్లో రైతు లు ఎక్కువగా మిరప పంటను సాగు చేస్తా రు. ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా దా దాపు 24,385.95 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. ఉద్యాన వన శాఖ అధికారుల అం చనా ప్రకారం దాదాపు 3.65 లక్షల క్వింటాళ్ల నుంచి నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మిర ప దిగుబడులు చేతికొస్తున్నాయి. కానీ, పంట ను అమ్ముకునేందు కు జిల్లాలో మార్కెట్‌ సౌక ర్యం లేదు. కొన్ని సంవత్సరాలుగా మిరప మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని రై తులు విజ్ఞప్తులు చేస్తున్నా, ఎవరూ స్పందిం చడం లేదు. ప్రస్తుతం అలంపూర్‌, గద్వాలలో వ్యవసా య మార్కెట్లో ఉన్నాయి. ఈ మార్కెట్లలో పా లక వర్గాలూ కొలువుదీరాయి. వీరు కూడా రై తుల పక్షాన మాట్లాడటం లేదు. మిరపకు మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు కనీసం ప్ర తిపాదనలు కూడా చేయడం లేదు. అధికారు లు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖకు లేఖలు రా స్తామని చెప్పి, చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.


దళారీ చేతిలో బంధీ

జిల్లాలో మిరప పంటను కొనుగోలు చేసేం దుకు మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో దళారులు రంగంలోకి దిగారు. పంటలను కొ నుగోలు చేసేందుకు జిల్లాలో ఇద్దరికే ట్రేడింగ్‌ లైసెన్స్‌ ఉన్నా, పదుల కొద్దీ వ్యాపారులు అ క్రమంగా పంటలను కొనుగోలు చేస్తున్నారు. పంటల సాగుకంటే ముందే వీరు మిరప రైతు లను కలుస్తున్నారు. వారికి కొంత డబ్బు అ డ్వాన్ప్‌గా ముట్టజెప్తున్నారు. పంట చేతికొచ్చాక మిగిలిన మొత్తం చెల్లించి, అందులో రెండు శాతం కమీషన్‌ కింద కోత విధిస్తున్నారు. తు కాల్లోనూ మోసం చేస్తున్నారు. రైతులకు ప్రస్తు తం మార్కెట్లో మిర్చికి ఉన్న ధరపై అంచనా లేకపోవడంతో, దళారులు చెప్పిన ధరకే పంట ను వారికి అమ్ముతూ దగా పడుతున్నారు. ఈ వ్యవహారమంతా బాహాటంగానే జరుగుతున్నా, దళారీ వ్యవస్థను కట్టడి చేయడంలో అధికారు లు విఫలమవుతున్నారు. వారిచ్చే మామూళ్ల కు అలవాటు పడి చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, అక్ర మంగా మిరపను చెక్‌పోస్టులు దాటిస్తున్నా, ని ఘా ఉంచడం లేదు. 


పడిపోయిన ధరలు

మిరప ధరలు పతనమయ్యాయి. మొన్నటి వరకు రూ.14 వేలు పలికిన క్వింటాల్‌ ధర, నే డు రూ.8 వేల నుంచి రూ.10,500కు చేరాయి. ధరలు తగ్గడంతో దళారులు మరింత ధరలు తగ్గించి, రైతుల నుంచి మిరపను కొనుగోలు చేస్తున్నారు. డబ్బు అవసరం లేని రైతులు మాత్రం కోల్డ్‌ స్టోరేజీలో పంటను భద్రపర్చు కుంటున్నారు. బస్తాకు రూ.120 నుంచి రూ.150 చెల్లించి ధరలు వచ్చే వరకు కోల్డ్‌ స్టో రేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. డబ్బు అవసరమున్న రైతులు మాత్రం దళారులు చెప్పిన ధరకే పంటను అమ్ముతూ నష్టపోతున్నారు.

Updated Date - 2021-04-16T05:20:28+05:30 IST