విద్యార్థులతో నీటిసంపులు శుభ్రం

ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST

స్థానిక ఆదర్శ పాఠశాలలో శనివారం విద్యార్థులతో నీటి సంపులను శుభ్రం చే యించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

విద్యార్థులతో నీటిసంపులు శుభ్రం

ఆదర్శ పాఠశాలలో ఘటన..

సోషల్‌ మీడియాలో వైరల్‌

పుట్లూరు, నవంబరు27: స్థానిక ఆదర్శ పాఠశాలలో శనివారం విద్యార్థులతో నీటి సంపులను శుభ్రం చే యించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఆదర్శ పాఠశాలలో ఉదయం 9 గంటలకు విద్యార్థులు పాఠశాలకు రాగానే సంపులు శుభ్రం చేయాలంటూ అటెండర్లు చె ప్పారు. దీంతో 7, 8 తరగతుల విద్యార్థులు అమర్‌నాథ్‌, కిషోర్‌ను సు మారు 10 అడుగుల లోతు ఉన్న రెండు సంపుల్లోకి దించి, శుభ్రం చే యించారు. వీటిని కొందరు వీడియో తీసి, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన ప్రిన్సిపాల్‌ లావణ్య అటెండర్లు లింగమ్మ, గౌడ్‌, నాగేష్‌, ఆయా నిర్మలకు మెమోలు జారీ చే శారు. వెంటనే విషయం తెలుసుకు న్న ఎంఈఓ శ్రీదేవి పాఠశాలకు చేరుకుని, విద్యార్థులను విచారించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎం ఈఓ మండిపడ్డారు. విద్యార్థులకు ఏ మైనా జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ విషయంపై తహసీల్దార్‌ విజయకుమారి ఆరాతీశారు. విద్యార్థులతో పనులు చేయిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST