Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలకు తరచూ కోపం వస్తోందా!

ఆంధ్రజ్యోతి(2-11-2020)

యుక్తవయసుకు వచ్చిన పిల్లల ప్రవర్తనను ఊహించడం కష్టమే. వారి భావోద్వేగాలు ఒకేలా ఉండవు. వారిలో ఒకసారి బాధ, కోపం, ఒంటరితనం, సంతోషం... ఇలా పలు రకాల భావోద్వేగాలు కనిపిస్తుంటాయి. ఈ సమయంలోనే యవ్వనంలో అడుగుపెట్టిన పిల్లలు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వారిని మందలించకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. పిల్లల కోపాన్ని తగ్గించేందుకు ఏం చేయాలంటే....


తిట్టడం, కొట్టడం చేయొద్దు: కోపంగా ఉన్న పిల్లలను తిట్టడం లేదా కొట్టడం వల్ల వారికి కోపం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుచేత వారి కోపం చల్లారేందుకు వారితో విడిగా మాట్లాడాలి. వారికి కోపం తెప్పించిన విషయం ఏంటో తెలుసుకోవాలి. దీంతో తరచుగా పిల్లల కోపానికి కారణమయ్యేవి ఏంటో గ్రహించవచ్చు. 


ప్రతి దానికి ఒకే అనొద్దు: కొన్నిసార్లు టీనేజ్‌ పిల్లలకు వారు కోరినది ఇవ్వకుంటే వెంటనే కోపం తెచ్చుకుంటారు. ఈ పరిస్థితి రాకూడదంటే తల్లిదండ్రులు వారు ఏది అడిగితే అది తీసుకురావడం మానేయాలి. అవసరం అయితే తప్ప ప్రతిదీ తెచ్చివ్వకూడదు. ఈ అలవాటును వారికి చిన్నతనం నుంచే అలవర్చాలి. దాంతో పిల్లలు తమకు బాగా అవసరం ఉన్నవి మాత్రమే అడుగుతారు.


పిల్లలు చెప్పేది వినాలి: సాధారణంగా యవ్వనంలో అడుగిడిన పిల్లలు ముభావంగా ఉంటారు. అలాంటిది వారు ఏ విషయమైనా పంచుకోవాలని అనుకుంటే వారు చెప్పేది తల్లిదండ్రులు ఓపికగా వినాలి. వారికి కోపం ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి. వారికి ఏ సహాయం కావాలన్నా తమను నిర్భయంగా అడగాలని పిల్లలకు చెప్పాలి. వారితో కలిసి ధ్యానం, యోగా చేయడం ద్వారా వారి కోపాన్ని తగ్గించవచ్చు.

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement