Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లలు సరిగ్గా తినడంలేదా..!

చిన్నపిల్లలు ఆటల్లోనో, మరేదైనా వ్యాపకంలోనో పడి సరిగ్గా తినరు. మరికొంతమది పిల్లలు వాళ్లకు నచ్చింది పెడితే తప్ప కంచం వైపు చూడరు. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి... ఇప్పుడు సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే పెద్దయ్యాక కూడా అవే కొనసాగుతాయి. మీ పిల్లలకు సరైన ఆహారలపు అలవాట్ల కోసం నిపుణుల సూచిస్తున్న ఈ సలహాలు పాటించండి... 


పిల్లలు ఆకలి లేదంటున్నా బలవంతంగా తినిపించకండి. అలాగే వారికి ఇష్టం లేని వాటిని తినిపించడానికి లంచాలు ఇవ్వడం సరైంది కాదు. దీనివల్ల పిల్లల్లో తిండి పట్ల వ్యతిరేక భావం పెంపొందుతుంది.  

భోజనం, చిరుతిండ్లకు వేర్వేరు సమయాలు కేటాయించండి. ఏ వేళకు ఏది పెట్టాలో అదే పెట్టండి. అలాకాకుండా రోజంతా ఏదోఒకటి తింటూ ఉంటే ఆకలి మందగించి మీల్స్‌ ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. 

కొత్త వంటకమేదైనా వారి ముందు పెట్టినప్పుడు నచ్చితే తినేస్తారు. నచ్చకపోతే వదిలేస్తారు. వదిలేశారని ఆ ఫుడ్‌ను ఇవ్వడం మానేయకుండా మళ్లీ మళ్లీ వాళ్లకు తినిపించే ప్రయత్నం చేయాలి. పిల్లలు బాగా ఇష్టపడే ఆహారంతోపాటు నిదానంగా కొత్తవి అలవాటు చేయండి. 

అందరి కోసం వండిన వంటే పిల్లలకూ పెట్టండి. తినలేదని వేరేగా వండి పెడితే ఇక వారికి నచ్చింది తప్ప ఇతర ఫుడ్స్‌ ముట్టుకోరు. 

టీవీలు, మొబైల్స్‌ వంటివి చూస్తూ తిననివ్వకండి. మీరు కూడా వేరే పనులు మానేసి, తిన్నంత సేపూ పిల్లల దగ్గరే కూర్చోండి. తినే తిండి మీద తప్ప మరే అంశాలపైకీ దృష్టి మరలకుండా చూసుకోండి.


Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...