సమావేశంలో మాట్లాడుతున్న చైర్ పర్సన్
బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి
జగిత్యాల టౌన్; మే 28: శారీరక మార్పులపై పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు నెలసరి సమస్యలపై ప్రతి మహిళకు అవగాహన తప్పనిసరి అని జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల బల్దియా సమావేశ మందిరంలో శనివారం మహిళా సంఘ స భ్యులకు, మహిళ కార్మికులకు రుతు పరిశుభ్రత దినోత్సవంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అథితిగా చైర్ పర్సన్ శ్రావణి హాజరై మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు భారతి హాజరై మహిళలకు రుతుస్రావ సమస్యలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళలకు పౌష్టికాహారంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో కమిషనర్ స్వరూప రాణి, కౌన్సిలర్లు వల్లెపు రేణుక, వొద్ది శ్రీలత, బాలె లత, పధ్మావతి, లావణ్య, కూతురు పద్మ, ఆసియా సుల్తానా, డీఎం సీ సునీత, టీఎంసీ రజిత ఉన్నారు.