ప్రకృతితో మమేకమయ్యే పిల్లల ఆలోచనల్లో భారీ పరిణతి!!

ABN , First Publish Date - 2020-02-18T09:03:56+05:30 IST

ఎలా జీవించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను పిల్లలకు నేర్పించే విషయంలో ప్రకృతిని మించిన గురువు మరొకటి

ప్రకృతితో మమేకమయ్యే పిల్లల ఆలోచనల్లో భారీ పరిణతి!!

మెల్‌బోర్న్‌, ఫిబ్రవరి 17 : ఎలా జీవించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను పిల్లలకు నేర్పించే విషయంలో ప్రకృతిని మించిన గురువు మరొకటి లేదని సౌత్‌ ఆస్ట్రేలియా వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. అడవి, తోట, చెరువు, బురద, ఇసుక, రాళ్లూరప్పల వంటి ప్రకృతి నెలవుల్లో తిరుగాడే అవకాశం పొందిన పిల్లలు ప్రపంచాన్ని చూసే తీరే వేరుగా ఉంటుందని వారు చెబుతున్నారు. మట్టితో బొమ్మలు చేసి.. కట్టెలతో ఇళ్లు కట్టి ఆడిపాడిన చిన్నారుల మెదడులోకి సామాజిక సంబంధాల పాఠాన్ని ప్రత్యేకంగా చొప్పించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. చెరువులు మత్తడిపోయడాన్ని చూసిన.. అడవుల్లో అసౌకర్యాల గురించి తెలుసుకున్న.. రాళ్లూరప్పల కాఠిన్యాన్ని చవిచూసిన పిల్లలకు క్లిష్ట సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో బాగా తెలుసని విశ్లేషించారు. చైల్డ్‌ కేర్‌ సెంటర్లు, ప్లే స్కూళ్లు, పాఠశాలల్లో ఎటువంటి వాతావరణం ఉంటే పిల్లల సంపూర్ణ మనోవికాసం జరుగుతుందనేది తెలుసుకునేందుకు ఈ వివరాలు దోహదపడతాయి. ‘పీఎల్‌వోఎస్‌ వన్‌’ జర్నల్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. 

Updated Date - 2020-02-18T09:03:56+05:30 IST