పిల్లల ప్రాణాలతో చెలగాటం..!

ABN , First Publish Date - 2020-03-28T09:18:41+05:30 IST

కోవిడ్‌-19 నియంత్రణ, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో కొందరు వలంటీర్లు, ఉపాధ్యాయులు పిల్లల ప్రాణాలతో చెలగాటం...

పిల్లల ప్రాణాలతో చెలగాటం..!

  • ఇళ్ల వద్దకు వెళ్లని వలంటీర్లు, ఉద్యోగులు
  • స్కూళ్లకు పిలిచి మధ్యాహ్న భోజన    సరుకుల పంపిణీ
  • కరోనా వైరస్‌ విస్తరణ క్రమంలో 
  • ఇది ప్రమాదకరం  4 చిక్కీల్లో 1, 2 మాత్రమే అందజేత
  • నగరంలో యథేచ్ఛగా ఉత్తర్వులు బేఖాతర్‌

అనంతపురం విద్య, మార్చి 27 : కోవిడ్‌-19 నియంత్రణ, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో కొందరు వలంటీర్లు, ఉపాధ్యాయులు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో కోడిగుడ్లు, బియ్యం, మధ్యాహ్న భోజనం(ఎండీఎం) సరుకులను పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి అందించాలని ఆదేశాలిచ్చారు. గ్రామ వలంటర్లు, సచివాల ఉద్యోగులే నేరుగా పిల్లల ఇళ్ల వద్దకెళ్లి...వారి తల్లిదండ్రుల కు అందించేలా చూడాలని ప్రభుత్వం ఆదే శించింది. అయి తే కొందరు ఈ ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్నారు.

సరుకులు ఇవ్వాలంటూ 23న ఉత్తర్వులు...

స్కూళ్లలో ఎండీఎం పరిధిలోకి వచ్చే విద్యార్థులకు సరు కులు ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలని ఈనెల 23న పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాజశేఖర్‌ ఉత్తర్వులిచ్చారు. ఈనెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ లెక్క కట్టి 1 కేజీ నుంచి 1.5 కేజీల బియ్యం, 8 గుడ్లు,4 చిక్కీలు(25 గ్రా మాలు) అందజేయాలని ఆదేశాలిచ్చారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా పిల్లల ఇళ్ల వద్ద తల్లిదండ్రు లకు అందించాలి. అయితే కొందరు ఉపాధ్యాయులు, వ లంటీర్లు పిల్లలను స్కూళ్ల వద్దకు రప్పించి పంపిణీ చే స్తున్నారు. 


పలు స్కూళ్లలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, వలంటీర్లు విద్యార్థులను స్కూళ్లకు పిలిపించి బి య్యం, చిక్కీలు, కోడి గుడ్లు అందిస్తున్నారు. తాజాగా శుక్రవారం నగరంలోని రాజేంద్రమున్సిపల్‌ స్కూల్‌లో విద్యార్థులను స్కూల్‌కు పిలిపించి చిక్కీలు, కోడి గుడ్లు పంపిణీ చేశారు. అయితే 4 చిక్కీలు ఇవ్వాల్సి ఉండగా, పిల్లలకు కొందరికి 1, మరికొందరికి 2 చొప్పున అందించారు. వాస్తవానికి 4 ఇవ్వాల్సి ఉండగా 1, 2 ఇ చ్చి చేతులు దులుపుకున్నారు.  పాతూరులోని కస్తూర్బా స్కూల్‌ పిల్లలను పిలి పించి పంపిణీ చేశారు. విద్యార్థుల మధ్య సామాజిక దూరం పాటించారు. అయి తే ఇలా స్కూళ్లకు పిలిపించి పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  


Updated Date - 2020-03-28T09:18:41+05:30 IST