America: పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న డెల్టా వేరియంట్

ABN , First Publish Date - 2021-08-15T22:25:35+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ తీవ్రత అక్కడ అధికంగా ఉంది. దీంతో కొవిడ్ కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని

America: పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న డెల్టా వేరియంట్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ తీవ్రత అక్కడ అధికంగా ఉంది. దీంతో కొవిడ్ కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో ఆసుపత్రుల్లో పిల్లల సంఖ్య పెరుగుతోంది. హెల్త్ అండ్ హ్యూమన్ సర్విసెస్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరిన పిల్లల సంఖ్య శనివారం నాటికి 1,902కు చేరింది. ప్రస్తుతం అమెరికాలో 12ఏళ్ల లోపు పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు కాదు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది గత సంవత్సరం కోవిడ్ కాదు. డెల్టా వేరియంట్ దారుణంగా ఉంది. దీనివల్ల పిల్లలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు’ అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మాజీ ప్రెసిడెంట్ సాలీ గోజా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపని ప్రాంతాల్లోనే డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని వైద్య నిపుణులు ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-08-15T22:25:35+05:30 IST