ఘన ఆహారాలతో శిశువుల ఆరోగ్యానికి ముప్పు

ABN , First Publish Date - 2020-04-08T07:37:41+05:30 IST

శిశువులకు 3 నెలలైనా నిండకముందే ఘన ఆహార పదార్థాలను తినిపించడం మంచిదికాదని అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఘన ఆహారాలతో శిశువుల ఆరోగ్యానికి ముప్పు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: శిశువులకు 3 నెలలైనా నిండకముందే ఘన ఆహార పదార్థాలను తినిపించడం మంచిదికాదని అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే శిశువులకు భవిష్యత్తులో ఎగ్జిమా, ఫుడ్‌ అలర్జీలు, ఆస్తమా వంటి ఆరోగ్యపరమైన అనర్ధాలు ఎదురుకావచ్చని వారు హెచ్చరించారు. ఘన ఆహారపదార్థాలతో నవజాత శిశువుల జీర్ణాశయ, వ్యాధి నిరోధక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. 

Updated Date - 2020-04-08T07:37:41+05:30 IST