టీకా వేసుకోని 18ఏళ్లలోపు ప్రవాస పిల్లల విషయంలో Kuwait సంచలన నిర్ణయం.. ఇకపై వారికి..

ABN , First Publish Date - 2021-09-07T16:41:18+05:30 IST

రోనా వ్యాక్సిన్ తీసుకోని 18 ఏళ్లలోపు ప్రవాస పిల్లల విషయం గల్ఫ్ దేశం కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

టీకా వేసుకోని 18ఏళ్లలోపు ప్రవాస పిల్లల విషయంలో Kuwait సంచలన నిర్ణయం.. ఇకపై వారికి..

కువైత్ సిటీ: కరోనా వ్యాక్సిన్ తీసుకోని 18 ఏళ్లలోపు ప్రవాస పిల్లల విషయం గల్ఫ్ దేశం కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోని 18ఏళ్లలోపు పిల్లలు తిరిగి కువైత్ రావొచ్చని ప్రకటించింది. కానీ, వచ్చిన తర్వాత కచ్చితంగా టీకా తీసుకుంటామని వారు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. తిరిగి వచ్చిన వారు తాము కువైత్‌లో వ్యాక్సిన్ తీసుకుంటామని ప్రత్యేక పత్రంపై సంతకం చేయాలి. అలాగే అక్కడి కరోనా సుప్రీం కమిటీ నిబంధనల ప్రకారం అవరమైనప్పుడు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసులకు కువైత్‌లో ఎంట్రీ లేదు. అలాగే ఎవరైతే చైనా, రష్యా టీకాలు తీసుకున్నారో వారు కువైత్ వచ్చిన తర్వాత  అక్కడ ఆమోదం పొందిన టీకా మూడో డోసు వేసుకోవాల్సి ఉంటుంది.


క్రీడా మైదానాలలో ప్రేక్షకులకు అనుమతి..

కువైత్ మంత్రివర్గం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 10(శుక్రవారం) నుంచి క్రీడా మైదానాలలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే స్టేడియాల్లో ప్రవేశం ఉంటుంది. అలాగే మైదానంలో కేవలం 30 శాతం మందిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది.  స్టేడియాలకు వచ్చే అభిమానులు ఆరోగ్యశాఖ సూచించిన విధంగా  తప్పకుండా కరోనా నిబంధనలను పాటించాలని కోరింది.   

Updated Date - 2021-09-07T16:41:18+05:30 IST