Advertisement
Advertisement
Abn logo
Advertisement

మనసెరిగి ప్రవర్తించాలి...

పిల్లలపై అరవడం, ప్రతి చిన్నపని కూడా ‘ఇలా కాదు అలా’ అని పదేపదే చెబుతుంటారు కొందరు తల్లితండ్రులు. దాంతో పిల్లలు ఒకరమైకన సందిగ్ధంలో పడిపోతారు. ఏది సరైందో, ఏది సరైంది కాదో తేల్చుకోలేకపోతారు. పిల్లలు ఒక్కోసారి వింతగా ప్రవర్తించడం చాలామంది పేరెంట్స్‌కు ఒక పట్టాన అర్థం కాదు. పిల్లలు ఎదురు సమాధానం చెప్పడం, మాట వినకపోవడం, మంకు పట్టు పట్టడం, అయిష్టత చూపడం వంటివి తల్లితండ్రులు- పిల్లల మధ్య సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. అసలు ఎందుకిలా జరుగుతుంది, ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఏం చేయాలంటే... దీనికంతటికి కారణం తమ మాటే నెగ్గాలని తల్లితండ్రులు, పిల్లలు అనుకోవడం. తమ బిడ్డల జీవితం తాము నిర్దేశించినట్టు ఉండాలనే పెద్దల ఆలోచనతో పిల్లలు వ్యతిరేకిస్తారు. వారు పెరిగే కొద్దీ తమ పనులు, జీవితం తమకు నచ్చినట్టు ఉండాలనుకుంటారు కొందరు పిల్లలు. దీంతో సమస్య మొదలవుతుంది. అలా జరగకుండా ఏం చేయాలంటే చిన్నతనం నుంచే పిల్లల ప్రవర్తన, తీరుపై తల్లితండ్రులు నియంత్రణ కలిగి ఉండాలి. వారు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పడు ఆడుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి... ఇలా వారికి ఏది మంచిదో పేరెంట్స్‌ నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. లేదంటే వారు భయస్తులుగా, ఆత్మవిశ్వాసం లేనివారుగా మారతారు. ఇది పిల్లల వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. అలాకాకుండా పిల్లల మనసు అర్థం చేసుకొని, వారికి నచ్చజెబుతూ ప్రవరిస్తే ఏ సమస్యా ఉండదు. దాంతో పిల్లలు ఏ విషయాన్నైనా తల్లితండ్రులతో పంచుకుంటారు. వారు స్వతంత్రంగా ఎదుగుతారు. సొంతంగా నిర్ణయం తీసుకొనే లక్షణం అలవడుతుంది.

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement