Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీ పిల్లలూ కోపంలో ఇలాగే చేస్తున్నారా? అయితే..

ఆంధ్రజ్యోతి(13-11-2021)

పెద్దలు కోపంతో గొడవపడటం, అరవటం చేస్తుంటారు. ఇలాగే పిల్లలూ చేస్తుంటారు. ఎమోషన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ చేయడం మంచిదే. అయితే పిల్లలు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించటం కూడా ఇబ్బందే. బాల్యంలోనే యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పటం తల్లిదండ్రుల బాధ్యత. 


పిల్లలంటే హాయిగా నవ్వుతూ ఉండే ముఖాలే గుర్తొస్తాయి. అయితే కొందరు ఎక్కువగా ఏడుస్తుంటారు. చేతికి దొరికిన వాటిని విసిరేస్తూ తమ కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారితో కోపం వల్ల ఉపయోగం లేదని ఉదాహరణలతో తెలియజేయాలి. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులవుతాయో కథల రూపంలోనో, వాస్తవ విషయాలనో చెప్పాలి. ముఖ్యంగా ఇంట్లో కమ్యూనికేషన్‌ ముఖ్యం. కోప్పడితే సాధించొచ్చు, ఏడిస్తే సాధించొచ్చని చిన్నపిల్లలు వాటిని తరచూ ప్రదర్శిస్తుంటారు. అసలు వారి బాధ, కోపం వెనకాల జరిగేదేంటో కూల్‌గా అడగాలి. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వాళ్ల ఎమోషన్స్‌ తెలుసుకొని వారికి సపోర్ట్‌గా తల్లిదండ్రులు ఉంటే పిల్లల ఆలోచనల్లో మార్పు వస్తుంది. కోపం తగ్గుతుంది.


ఫలానా బొమ్మ కావాలని ఏడుస్తూ.. ఇంట్లో వస్తువులని విసిరేస్తే కొట్టకూడదు. కూల్‌ అయ్యేవరకూ వేచి చూడాలి. పెద్దలు రియాక్ట్‌ కాకపోతే పిల్లలు ఆలోచనలో పడిపోతారు. కోప్పడితే.. నడిపించటం, నంబర్లను లెక్కించడం చేయాలి. ఫలానా వస్తువులు కావాలని మారాం చేసి కోప్పడితే ఆ క్షణానికి కొన్నా.. అదే అలవాటవుతుంది. అందుకే అలా చేయకూడదు. వీలైనంత వరకూ క్రైమ్‌ వీడియోలను, హింస ఎక్కువ ఉండే వీడియోలకు, వీడియో గేమ్‌లకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌కి దూరంగా ఉంచాలి. మొత్తానికి కోపం వల్ల సాధించేదేమీ ఉండదు. అది బయట ప్రపంచంలో పనికిరాదనే విషయాన్ని పిల్లలకు తెలియజెప్పే బాధ్యత తల్లిదండ్రులదే.

Advertisement
Advertisement