బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేయాలి

ABN , First Publish Date - 2020-07-14T00:32:55+05:30 IST

కరోనా వ్యాప్తి నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యారని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ అభిప్రాయపడింది.

బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేయాలి

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యారని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ అభిప్రాయపడింది. ముఖ్యంగా బాల కార్మికులకు సంబంధించి పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జె. శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. పేదకుటుంబాలు ఎక్కువగా పిల్లలను ఆదాయాన్ని జోడించమని ఒత్తిడి చేయడం వల్ల బాల కార్మికులుగా మారుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బాలకార్మికుల విభిన్న సమస్యలను పరిష్కరించడంలో కార్మికశాఖకు కీలక పాత్ర ఉందని అన్నారు.


బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవల్సిన చర్యలపై బాలల హక్కులపరిరక్షణ కమిషన్‌ కార్మిక శాఖకు కొన్నిసిఫారసులు చేసిందని ఆయన వెల్లడించారు. ఇందులో బాలకార్మికుల కోసం రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఉమెన్‌ అండ్‌ఛైల్డ్‌ వెల్ఫేర్‌ , పోలీస్‌, సివిల్‌సొసైటీ అర్గనైజేషన్‌ వంటి వివిధ సంబంధిత లైన్‌ విభాగాలతో కలిసి బాల కార్మికుల పై సమయ, పరిమితి , క్రమబద్దమైన ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించింది. పత్తివిత్తనాలు, ఇటుకబట్టీలు, హోటళ్లు, దాబాలు, బీడీ రోలింగ్‌ , గృహ పనుల్లో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు. 


దీనిపై దృష్టిపెట్టాలని సూచించింది. కన్‌స్ట్రక్షన్స్‌ బోర్డు, అనధికారిక వర్కర్స్‌ బోర్డు సభ్యులైన కార్మికుల పిల్లల కోసం పధకాలు, కార్యక్రమాలను అభివృద్ది చేయాలని సూచించింది. పిల్లలు, యువత విద్య కొనసాగించేందుకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రో గ్రామ్‌లతో సహా నిర్ధిష్ట సహాయ కార్యక్రమాలను రూపొందించడం, అమలుచేయడం అవసరమని సూచించింది. 

Updated Date - 2020-07-14T00:32:55+05:30 IST