తల్లి హత్యపై కంటతడి పెట్టించే కుమార్తె భావోద్వేగ లేఖ ఇది!

ABN , First Publish Date - 2022-04-13T15:20:52+05:30 IST

9 ఏళ్ల బాలిక తన తల్లి హత్య నేపధ్యంలో...

తల్లి హత్యపై కంటతడి పెట్టించే కుమార్తె భావోద్వేగ లేఖ ఇది!

9 ఏళ్ల బాలిక తన తల్లి హత్య నేపధ్యంలో భావోద్వేగంతో ఒక లేఖ రాసింది. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి తాను మంచి పనులు చేస్తానని, స్వర్గంలో కలుస్తానని లేఖలో తన తల్లికి వాగ్దానం చేసింది. ఈ చిన్నారి ఆ లేఖలో 'అమ్మా, ఈ ఉత్తరం నీకు బహుమతి. మీరు నన్ను పెంచి పోషించడం వృథా అయ్యిందని మీరు అనుకుంటే.. నా జీవితంలో ఇప్పటివరకూ మీతో గడిచిన అత్యంత ప్రత్యేకమైన 9 సంవత్సరాలకు ధన్యవాదాలు.' అని పేర్కొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన ఈ బాలిక తల్లి మృతి చెందింది. ఆ చిన్నారి తన లేఖలో 'నా బాల్యం మీ సమక్షంలో గడిచినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ ప్రపంచంలో అత్యుత్తమ తల్లి. నేను మిమ్మల్ని ఎప్పటికి మరువలేను. మీరు స్వర్గంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు స్వర్గానికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.


మనం స్వర్గంలో కలుద్దాం. నేను కూడా స్వర్గానికి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఈ లేఖను ఉక్రెయిన్ ఎంపీ అంటోన్ గెరాష్‌చెంకో ట్విట్టర్‌లో షేర్ చేశారు. అతను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు. కొంతకాలం క్రితం ఉక్రెయిన్‌కు చెందిన మరో చిన్నారి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి విడిపోయాడు. ఆ తర్వాత 11 ఏళ్ల బాలుడు ఒంటరిగా 965 కి.మీ ప్రయాణించాడు. అతని చేతిపై ఫోన్ నంబర్ కూడా రాసి ఉంది. ఈ బాలుడు తన ప్రాణాలను కాపాడుకుంటూ ఒంటరిగా స్లోవేకియా సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. ఆ పిల్లాడు ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా ప్రాంతానికి చెందినవాడు. జపోరిజ్జియాకు రష్యా తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆ బాలుడి ధైర్యాన్ని స్లోవేకియా అధికారులు ప్రశంసించారు. బాలుడు బ్యాక్‌ప్యాక్, పాస్‌పోర్ట్, చేతిపై ఫోన్ నంబర్ రాసుకుని అక్కడికి చేరుకున్నాడని అధికారులు తెలిపారు. స్లోవేకియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతన్ని నిజమైన హీరో అంటూ అభివర్ణించింది. అతను చిరునవ్వుతో అందరినీ కలిశాడని, అతని ముఖంలో భయం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో- 'స్లోవేకియాలో ఉన్న బంధువులను ఆ పిల్లాడు గుర్తించారు. అనంతరం ఆ బాలుడు క్షేమంగా కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుకున్నాడని పేర్కొంది. 



Updated Date - 2022-04-13T15:20:52+05:30 IST