Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాలుడి ఆచూకీ కోసం గాలింపు

సంగం, అక్టోబరు 22: సంగం నిమ్మతోపు సెంటర్‌లో అదృశ్యమైన బాలుడు శివగణేష్‌ కోసం సంగం పోలీసులు శుక్రవారం కాలువ నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన శ్రీహరి కుమారుడు శివగణేష్‌(3) తోటి పిల్లలతో ఆడుకుంటూ గురువారం రాత్రి అదృశ్యమైన విషయం విదితమే. కుటుంబ సభ్యులు, స్థానికుల అనుమానం మేరకు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి జాలర్ల సహకారంతో కాలువ వెంబడి నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలుడి తండ్రి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Advertisement
Advertisement