బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ABN , First Publish Date - 2022-01-25T05:07:01+05:30 IST
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి అంజని ప్రియదర్శిని పేర్కొన్నారు.
రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి అంజని ప్రియదర్శిని
రైల్వేకోడూరు రూరల్, జనవరి 24: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి అంజని ప్రియదర్శిని పేర్కొన్నారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మండలంలోని లక్ష్మీగారిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలికలు బాగా చదివి ఉన్నత స్థాయిలో రాణించాలని కోరారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ ఎం.సురేష్ రెడ్డి, పాఠశాల ప్రఽధానోపాధ్యాయురాలు డి.విమల తదితరులు పాల్గొన్నారు.