మొబైల్‌లో వీడియో చూసి ఉరేసుకున్న బాలుడు.. చివరి నిమిషంలో కేకలు పెట్టడంతో..

ABN , First Publish Date - 2022-07-18T01:12:14+05:30 IST

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా టీనేజ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి.

మొబైల్‌లో వీడియో చూసి ఉరేసుకున్న బాలుడు.. చివరి నిమిషంలో కేకలు పెట్టడంతో..

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా టీనేజ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. వాటి ప్రభావానికి లోనైన చాలా మంది పిల్లలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మొబైల్ ఫోన్‌లో వస్తున్న వీడియోలో ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన ఓ 11 ఏళ్ల బాలుడు తన ఇంట్లో అలాంటి ప్రయత్నం చేశాడు. తాడు గొంతుకు బిగుసుకుపోవడంతో కేకలు పెట్టాడు. తల్లిదండ్రులు వెంటనే అక్కడకు వెళ్లి బాలుడిని దించి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. బీహార్‌లోని పూర్ణియాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

తల్లిదండ్రుల మీద కోపంతో ఇంటి నుంచి పారిపోయిన 14 ఏళ్ల బాలిక.. 20 రోజుల పాటు ఆమె ఎంతటి నరకం అనుభవించిందంటే..


పూర్ణియాకు సమీపంలోని గువాసి గ్రామానికి చెందిన అఫ్రాన్ (11) తన కుటుంబ సభ్యులతో కలిసి మొబైల్‌లో ఓ వీడియో చూస్తున్నాడు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం చూశాడు. తను కూడా అలా ప్రయత్నించాలనుకుని అఫ్రాన్ మరో గదిలోకి వెళ్లాడు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యంలోలా కుండ మీద నిల్చుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తాడు గొంతుకు బిగిసుకుపోవడంతో ఉక్కిరిబిక్కిరై గట్టిగా అరవడం ప్రారంభించాడు. 


మరో గదిలో కూర్చున్న కుటుంబ సభ్యులు ఆ శబ్దాలు విని పరిగెత్తి వెళ్లి చూడగా అఫ్రాన్ ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అఫ్రాన్‌ను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన అఫ్రాన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆ బాలుడు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స కొనసాగుతోందని వైద్యులు చెప్పారు.  

Updated Date - 2022-07-18T01:12:14+05:30 IST