Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీటి సంపులో పడి చిన్నారి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం

బొమ్మలరామారం, అక్టోబరు 14: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో నీటిసంపులో పడి ఓ చిన్నారి మృతిచెందింది. మండల కేం ద్రానికి చెందిన బైసు రాజు-స్వప్నల దంపతుల కుమార్తె నీహారిక(2) గు రువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఇంట్లో ఆడుకుంటూ పైకప్పు లేని నీటి సంపులో పడింది. ఆ సమయంలో కుటుం బసభ్యులు ఇంట్లో బతుకమ్మ పండుగ పనులు చేసు కుంటూ చిన్నారిని గమనించలేదు. రెండు గంటలు గడిచినా చిన్నారి అలికిడి లేనందున చుట్టుపక్కల ఇళ్లలో వెదికారు. నీటి సంపులో చూడగా మృతి చెంది ఉండడంతో చిన్నారి మృతదేహాన్ని బయటికి తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుము కున్నాయి.

Advertisement
Advertisement