దూసుకెళ్లడంలో దిట్ట!

ABN , First Publish Date - 2020-03-21T06:26:08+05:30 IST

పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా సరే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ పుణేకు చెందిన పదకొండేళ్ల శ్రియా లోహియా. గత ఏడాది ‘జేకే టైర్‌ నేషనల్‌ కార్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో విజేతగా నిలిచి అందరి మన్ననలు

దూసుకెళ్లడంలో దిట్ట!

పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా సరే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు మంచి ఉదాహరణ పుణేకు చెందిన పదకొండేళ్ల శ్రియా లోహియా. గత ఏడాది ‘జేకే టైర్‌ నేషనల్‌ కార్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో విజేతగా నిలిచి అందరి మన్ననలు అందుకుంది. కేవలం 11 నిమిషాల 13.233 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసింది. గో కార్టింగ్‌ రేస్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రియ ప్రస్తుతం బెంగళూరులో ‘మెకొ మోటార్‌ స్పోర్ట్స్‌’లో శిక్షణ తీసుకుంటోంది. నాలుగేళ్ల వయసులో బొమ్మ కార్లతో ఆడుకున్న ఆమె ఇప్పుడు ట్రాక్‌పై దూసుకెళుతోంది. ఫార్ములా వన్‌ డ్రైవర్‌ కావాలన్నది తన లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళితో ముందుకెళుతోంది. ‘‘నా కుటుంబమే నా బలం. ఎప్పుడూ నా వెంట మా డాడీ ఉంటాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రోత్సహిస్తుంటాడు. ఇంకా ఎలా మెరుగైన ప్రదర్శన చేయాలో సలహాలు ఇస్తుంటాడు’’ అంటుంది శ్రియ. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.

Updated Date - 2020-03-21T06:26:08+05:30 IST