బాలుడి కడుపు నుంచి బ్యాటరీ తొలగింపు

ABN , First Publish Date - 2022-02-15T16:56:04+05:30 IST

నగరానికి చెందిన నాలుగేళ్ల బాలుడు టీవీ చూస్తూ రిమోట్‌ బ్యాటరీని మింగేశాడు. అది కాస్త కడుపులో చిక్కుకోవడంతో పరిస్థితి విషమించింది. అయితే స్థానిక క్రోంపేటలోని రేలా ఆస్పత్రి వైద్యులు దానిని ఎండోస్కోపీ ద్వారా తొలగించి ఆ బాలుడి

బాలుడి కడుపు నుంచి బ్యాటరీ తొలగింపు

చెన్నై: నగరానికి చెందిన నాలుగేళ్ల బాలుడు టీవీ చూస్తూ రిమోట్‌ బ్యాటరీని మింగేశాడు. అది కాస్త కడుపులో చిక్కుకోవడంతో పరిస్థితి విషమించింది. అయితే స్థానిక క్రోంపేటలోని రేలా ఆస్పత్రి వైద్యులు దానిని ఎండోస్కోపీ ద్వారా తొలగించి ఆ బాలుడిని రక్షించారు. ఆసుపత్రి సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.రవి నేతృత్వంలోని బృందం ఆ పసిబిడ్డను కాపాడారు. బాలుడి కడుపులో చిక్కుకుపోయిన 14 గంటల్లోనే బ్యాటరీని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. దీనిపై బాలుడి తండ్రి మాట్లాడుతూ.. మలవిసర్జన ద్వారా ఆ బ్యాటరీ బయటకు వచ్చే అవకాశముందని 12 గంటల పాటు వైద్యులు వేచి చూశారని, అయితే అది బయటకు రాకపోవడంతో పాటు పరిస్థితి విషమం గా మారుతుండడంతో ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని బయటకు తీశారని వివరిస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.


Updated Date - 2022-02-15T16:56:04+05:30 IST