మట్టిలో కూరుకుపోయిన మహిళ

ABN , First Publish Date - 2021-05-09T05:44:36+05:30 IST

నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద గుంత తీస్తుండగా పిల్లర్‌ పక్కకు ఒరిగి మహిళ మట్టిలో కూరుకుపోయిన ఘటన చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెంలో శనివారం జరిగింది.

మట్టిలో కూరుకుపోయిన మహిళ

కాపాడిన స్థానికులు, పోలీసులు 


చిలకలూరిపేట, మే 8: నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద గుంత తీస్తుండగా పిల్లర్‌ పక్కకు ఒరిగి మహిళ మట్టిలో కూరుకుపోయిన ఘటన చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెంలో శనివారం జరిగింది. గోవిందపురం మార్గంలో అరిగెల సుధాకర్‌, అతని పాలపర్తి మనోహరి కూలి ఇంటి నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. మెట్ల కింద గుంత తీస్తుండగా పిల్లర్‌ పక్కకు ఒరిగి మనోహరి గుంతలో సగం వరకు ఇరుక్కుపోయింది. రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌, స్థానికులు అక్కడికి చేరుకుని పొక్లెయినర్‌తో మట్టి తీయించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆమెను నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  

Updated Date - 2021-05-09T05:44:36+05:30 IST