Chikoti Praveen: చికోటి వ్యవహారంలో వెలుగులోకి అజ్ఞాత వ్యక్తులు

ABN , First Publish Date - 2022-07-29T23:39:36+05:30 IST

చికోటి వ్యవహారంలో అజ్ఞాత వ్యక్తులు వెలుగులోకి వస్తున్నారు. చికోటి చీకటి రాజ్యాన్ని సంపత్ ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ ఏలుతున్నాడు.

Chikoti Praveen: చికోటి వ్యవహారంలో వెలుగులోకి అజ్ఞాత వ్యక్తులు

హైదరాబాద్: చికోటి వ్యవహారంలో అజ్ఞాత వ్యక్తులు వెలుగులోకి వస్తున్నారు. చికోటి చీకటి రాజ్యాన్ని సంపత్ ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్  ఏలుతున్నాడు. చికోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) సామ్రాజ్యంలో సంపత్ కీలక పాత్ర ఉందని చెబుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలతో సంపత్‌ (Sampath)కు లింక్‌లున్నట్లు తెలుస్తోంది. చికోటి బర్త్‌ డే పార్టీకి సంపత్ కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ (Hyderabad) నుంచి విదేశాలకు సంపత్ ఫ్లయిట్స్‌ బుక్‌ చేసినట్లు గుర్తించారు. గోవా, నేపాల్, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియాలో సంపత్ హవా కొనసాగించాని అంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ (Bollywood Tollywood) తారలతోనూ సంపత్‌కు సత్సంబంధాలున్నట్లు తెలుస్తోంది. బిగ్ డాడీ అడ్డా కోసం సినీ తారలను సంపత్ బుక్‌ చేశాడు. బంజారాహిల్స్‌లో పెద్దఎత్తున పబ్ ఏర్పాటుకు చికోటి, సంపత్ సన్నాహాలు చేశారు. హవాలా ఆర్థిక లావాదేవీలన్నీ సంపత్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సంపత్ ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ ఆరా తీస్తోంది. త్వరలో సంపత్‌కూ నోటీసులు ఇస్తామని ఈడీ అధికారులు అంటున్నారు. సంపత్ కనుసన్నల్లోనే చికోటి ప్రవీణ్ ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెబుతున్నారు.


చీకోటి దావత్‌ అంటే..

‘కాయ్‌ రాజ్‌ కాయ్‌’ అంటూ చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి నేపాల్‌లో నడిపిన క్యాసినో దందాకు సంబంధించి ఈడీ విచారణలో పలు ఆసక్తిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చీకోటి ప్రవీణ్‌ దావత్‌ చేస్తున్నాడంటే.. వీఐపీలు, పోలీస్‌ అధికారులు క్యూ కడతారన్న ప్రచారం ఉంది. 10 సంవత్సరాల క్రితమే శంషాబాద్‌లోని ఓ మహాల్‌లో సుమారు రూ. కోటి ఖర్చుతో ఆడంబరంగా కూతురు బర్త్‌డే చేసిన చరిత్ర అతడిది. తరుచుగా వీఐపీలు, అధికారులకు దావత్‌లు ఇవ్వడం అతడి అలవాటు. జూన్‌ 12న చంపాపేటలోని సామ సరస్వతీ గార్డెన్స్‌లో తన జన్మదిన వేడుకలు అదిరిపోయేలా జరుపుకొన్నాడు. ఇక్కడి అధికారులను గోవా, శ్రీలంక, నేపాల్‌ వంటి చోట్ల తాను నిర్వహించే క్యాసినోలకు తీసుకెళ్లి అదిరిపోయే ఆతిథ్యం ఇస్తాడని.. అతడి ఆతిథ్యాన్ని స్వీకరించిన వారంతా తర్వాత అతడితో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారని చెబుతారు.

Updated Date - 2022-07-29T23:39:36+05:30 IST