చిక్కీలో పురుగుల కలకలం

ABN , First Publish Date - 2022-04-10T02:07:56+05:30 IST

నంద్యాల జిల్లాలో విద్యార్థులకు అందించిన చిక్కీల్లో పురుగుల బయటపడటంలో కలకలం రేగింది. బండి ఆత్మకూరు మండలం

చిక్కీలో పురుగుల కలకలం

నంద్యాల: నంద్యాల జిల్లాలో విద్యార్థులకు అందించిన చిక్కీల్లో పురుగుల బయటపడటంలో కలకలం రేగింది. బండి ఆత్మకూరు మండలం ఎ.కోడూరు గ్రామంలోని ఎస్సీ స్పెషల్‌ పాఠశాలలో దాదాపు 85 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి శుక్రవారం చిక్కీలు అందజేశారు. ఒకటో తరగతి చదువుతున్న శివశంకర్‌ చిక్కీని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తినబోగా అందులో నుంచి పురుగులు బయటపడ్డాయి. ఇది చూసిన విద్యార్థి తల్లిదండ్రులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా, వారు ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో బండి ఆత్మకూరు ఎంఈవో రామసుబ్బయ్య పాఠశాలకు వెళ్లి మిగిలిన చిక్కీలను పరిశీలించారు. విద్యార్థికి అందిన చిక్కీలో మాత్రమే పురుగు వచ్చిందని, మిగిలినవి బాగానే ఉన్నాయని, ఇక కవర్ల మీద తయారీ తేది మాత్రం లేదని, ఈ విషయాన్ని కడప ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు.

Updated Date - 2022-04-10T02:07:56+05:30 IST