నువ్వుల చిక్కీలు

ABN , First Publish Date - 2021-01-09T16:23:14+05:30 IST

సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు గొబ్బెమ్మలు, ముగ్గులే కాదు. నోరూరించే వంటకాలు కూడా ఉంటాయి. మన దగ్గరే కాదు దేశమంతటా సంప్రదాయ వంటలతో వేడుకలు ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ పండుగ వేళ కొన్ని రాష్ట్రాల రెసిపీలనుమీరూ రుచి చూడండి.

నువ్వుల చిక్కీలు

రుచుల సంక్రాంతి!

సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు గొబ్బెమ్మలు, ముగ్గులే కాదు. నోరూరించే వంటకాలు కూడా  ఉంటాయి. మన దగ్గరే కాదు దేశమంతటా  సంప్రదాయ వంటలతో వేడుకలు ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ పండుగ వేళ కొన్ని రాష్ట్రాల రెసిపీలనుమీరూ రుచి చూడండి.

పండుగ రోజున గుజరాతీలు ఇష్టంగా తినే స్నాక్‌ ఇది.

కావలసినవి: నువ్వులు - ముప్పావు కప్పు, బెల్లం - అర కప్పు, నెయ్యి - ఒకటిన్నర టీస్పూన్‌.

తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి నువ్వులను వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక బెల్లం వేసి కలపాలి. చిన్న మంటపై రెండు, మూడు నిమిషాలు ఉంచి కలపాలి. తరువాత నువ్వులు వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన మందపాటి పాత్రలో మిశ్రమాన్ని సమంగా పోయాలి. కత్తితో ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత పాత్రలో భద్రపరచుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-01-09T16:23:14+05:30 IST