ఆదర్శనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2021-04-11T06:51:48+05:30 IST

అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం శ్రమించిన ఆదర్శ నేత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ముత్యాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

ఆదర్శనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌

 ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ముత్యాల వెంకటేశ్వర్లు 

గుడివాడ (రాజేంద్రనగర్‌) : అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం శ్రమించిన ఆదర్శ నేత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ముత్యాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గుడివాడలోని ప్రధాన తపాల కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1944 సెప్టెంబర్‌ 30న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గుడివాడ రాజేంద్రనగర్‌లో ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో అలివేలమ్మ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారన్నారు.  ఆ సంఘటనను పురస్కరించుకుని  విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రవీణ్‌ అనే తెలుగు భాషోపాధ్యాయుడు అంబేడ్కర్‌ వేషధారణతో వెంటరాగా  డాక్టర్‌ వెంకటేశ్వర్లు తపాల సిబ్బందితో కలిసి ర్యాలీగా అలివేలమ్మ బాలికల వసతి గృహం(అంబేడ్కర్‌ భవన్‌) చేరుకున్నారు.  డివిజినల్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ సాగర్‌, ఆలిండియా ఎస్సీ ఎస్టీ వేల్ఫేర్‌ అసోసియేషన్‌ సెక్రటరీ నాగేంద్ర, జిల్లా ఆదిమాంధ్ర సంఘం అధ్యక్షుడు పి.జయరాజు తదితరులు పాల్గొన్నారు.

 ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ

గుడివాడటౌన్‌ : అంబేద్కర్‌ గుడివాడలో అడుగు పెట్టే 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ పోస్టల్‌ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ అంబేద్కర్‌ చిత్రంతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను  అంబేద్కర్‌ మెమోరియల్‌ భవన్‌లో శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.సునీత   ఆవిష్కరించారు.  సాంఘిక సంక్షేమం, స్ర్తీజ నోద్ధర ణ అంబేడ్కర్‌కు అత్యంత ఇష్టమైన అంశాలని సునీత పేర్కొ న్నారు.  ఈసభలో  చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎం.వెంక టేశ్వరరావు, దాసరి నాగేంద్రకుమార్‌, పొంగులేటి జయరాజు,  రమేష్‌, పోస్టల్‌ మాస్టర్‌ కెవి.డి.సాగర్‌, పలువురు పాల్గొన్నారు.    శ్రీమతి కాకి సునీతకు డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ మెమోంటోను జై భీమ్‌ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు కోటే రామచంద్రరావు బహుకరించారు. 



Updated Date - 2021-04-11T06:51:48+05:30 IST