బ్రెజిల్‌లో కరోనా బారిన పడిన ఏడో మంత్రి

ABN , First Publish Date - 2020-08-04T05:20:46+05:30 IST

బ్రెజిల్‌ను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం ఈ

బ్రెజిల్‌లో కరోనా బారిన పడిన ఏడో మంత్రి

బ్రసిలియా: బ్రెజిల్‌ను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. జూలై ఏడో తేదీన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కరోనా బారిన పడ్డారు. రెండు వారాల తర్వాత ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొద్ది రోజులకే ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక వీరిద్దరితో పాటు ఇప్పటివరకు బ్రెజిల్‌లో ఆరుగురు మంత్రులు కరోనా బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో మంత్రి చేరారు. బ్రెజిల్ ప్రెసిడెన్సీకి సంబంధించిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫీస్ మంత్రి వాల్టర్ బ్రాగా నెట్టోకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. వాల్టర్‌కు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని.. ఆయన ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక మానవ హక్కుల మంత్రి డామరెస్ అల్వెస్, వ్యవసాయశాఖ మంత్రి తెరీసా క్రిస్టినా ఈ రోజు కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 27,36,298 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 94,226 మంది మృత్యువాతపడ్డారు.  

Updated Date - 2020-08-04T05:20:46+05:30 IST