అగ్రవర్ణ పేదల కోసమే!

ABN , First Publish Date - 2022-01-26T08:36:02+05:30 IST

అగ్రవర్ణాల పేదలకు కూడా మంచి జరిగే దిశగా అడుగులు పడాలని 3.92 లక్షల మంది మహిళలకు వారి అకౌంట్లలో రూ.589 కోట్లు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈబీసీ నేస్తం పథకం ..

అగ్రవర్ణ పేదల కోసమే!

  • ఈబీసీ నేస్తంతో ఏటా 15 వేలు
  • మూడేళ్లలో రూ.45 వేలిస్తాం
  • 3.92 లక్షల మంది మహిళల ఖాతాల్లో 589 కోట్లు: సీఎం
  • మీట నొక్కి జమచేసిన జగన్‌


అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణాల పేదలకు కూడా మంచి జరిగే దిశగా అడుగులు పడాలని 3.92 లక్షల మంది మహిళలకు వారి అకౌంట్లలో రూ.589 కోట్లు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈబీసీ నేస్తం పథకం  లబ్ధిదారులకు ఆయన బటన్‌ నొక్కి నేరుగా నగదు జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్లు, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ తదితర వర్గాలకు మేలు జరిగేలా ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పేద మహిళలకు మేలు చేయాలన్న సంకల్పంతో వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన అక్కచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా  ప్రయోజనం చేకూరుతుందని, 60 ఏళ్ల పైన వయసు వారికి వైఎ్‌సఆర్‌ పెన్షన్‌ ద్వారా లబ్ధి కలుగుతుందని వివరించారు. 


అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటున్నామన్నారు. రుణ మాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు సంబంధించి సుమారు రూ.25 కోట్ల రుణ బకాయిలను చెల్లించాలని సంకల్పించినట్లు చెప్పారు.

Updated Date - 2022-01-26T08:36:02+05:30 IST